ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేష్ బాబు అదిరే రిప్లే..

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! సింహాన్ని లాక్ చేశానన్న రాజమౌళి.. మహేష్ బాబు అదిరే రిప్లే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికర్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో రాజమౌళి రామాయణం టచ్ కూడా ఇవ్వనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొదట్లో విదేశీ నటి ఈ సినిమాలో చేస్తుందని టాక్ వినిపించింది. ఆతర్వాత దీపికా పదుకొనె పేరు కూడా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు గట్టిగానే వినిపిస్తుంది. అంతే కాదు ఈ అమ్మడు రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ల్యాండ్ అయ్యింది. అమెరికాలో ఉంటున్న ప్రియాంక సడన్ గా హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో ఆమె మహేష్ సినిమా కోసమే వచ్చిందని ఫిక్స్ అయ్యారు కొందరు అభిమానులు.

ఇదిలా ఉంటే ఇప్పటికే మహేష్ సినిమా గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు రాజమోళి.. ఆమధ్య కెన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లారు. ఆతర్వాత ఓ సింహం ఫొటోకు మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతే కాదు సినిమా పై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు రాజమౌళి. ఈ పోస్ట్ లో సింహాన్ని లాక్ చేసినట్టు చెప్పారు అంతే కాదు ఆయన ఓ పాస్ పోర్ట్ కూడా చుపించారు. దీని అర్ధం పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేశా అని.. మహేష్ బాబు తరచు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన పాస్ పోర్ట్ తీసుకొని సినిమా షూటింగ్ కోసం లాక్ చేశా అనే హింట్ ఇస్తూ జక్కన్న ఈ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు . దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లే ఇచ్చారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ కొట్టారు మహేష్. అంతే కాదు నటి ప్రియాంకా చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లే ఇచ్చారు. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మహేష్ ఫ్యాన్ ఈ పోస్ట్ ను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా