ఉత్తర దక్షిణ ద్రోణి గ్యాంగ్టిక్ పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుండి ఒడిస్సా తీరం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరొక ద్రోణి.. ఆ వివరాలు ఇలా..
ఉత్తర దక్షిణ ద్రోణి గ్యాంగ్టిక్ పశ్చిమబెంగాల్, ఉత్తర ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం నుండి ఒడిస్సా తీరం మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరొక ద్రోణి.. దాని ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ఈరోజు తెలంగాణలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అని పేర్కొంది.
అలాగే తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్ , మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అటు ఈరోజు 12 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట. గరిష్టంగా మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 41 డిగ్రీలు, కనిష్టంగా భద్రాచలంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందట. రాగాల రెండు రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గొచ్చునని పేర్కొంది.