ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్ధిని ఇలా దారుణంగా ప్రవర్తించడం.. సంచలనంగా మారింది.
ఒకప్పుడు గురువులు ఈ గల్లీల కన్పిస్తే అవుతలి గల్లీలలోకి వెళ్లి పోతుండేది.. గురువులు కనవడ్తే చాలు ఒల్లు దగ్గర పెట్టుకుని నమస్తే చెప్పేది. గురువు క్లాసు రూములకొస్తే సిట్ డౌన్ అనేదాక కూసోకపోయేది.. వాతలొచ్చేతట్టు కొట్టినా మాట్లకుండ ఉండేది.. ఉపాధ్యాయులు ఏం చెబితే అది చేసేది.. నేర్చుకునేది.. కానీ.. ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్‌పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్ధిని ఇలా దారుణంగా ప్రవర్తించడం.. సంచలనంగా మారింది.
ఈ ఘటన విశాఖపట్నం-విజయనగరం జాతీయ రహదారిపై డకమ్మరి సమీపంలోని రఘు కళాశాల క్యాంపస్‌లో జరిగింది. అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. లెక్చరర్ పట్ల ప్రవర్తించిన తీరును నెటిజన్లు ఖండిస్తున్నారు.
వివరాల ప్రకారం.. రఘు కళాశాల కళాశాలో నిబంధనలను ఉల్లంఘించి ఆ బాలిక క్యాంపస్‌లో సెల్ ఫోన్ ఉపయోగిస్తుందని గమనించిన లెక్చరర్.. ఆమె మొబైల్ ను తీసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని ఫ్యాకల్టీ సభ్యురాలిని దుర్భాషలాడడం ప్రారంభించింది. అంతేకాకుండా.. కోపంతో తన పాదరక్షలను తీసి.. తన క్లాస్‌మేట్స్ ముందు లెక్చరర్‌పై దాడి చేసింది. ఇతర విద్యార్థులు జోక్యం చేసుకుని ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.. కానీ ఆమె దూకుడుగా ప్రవర్తించింది.
విద్యార్థిని తీరుతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.