భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు దగ్గరుండి ఆమెకు స్వామివారి దర్శనం చేయించారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు.

అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం రాష్ట్రపతికి ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనంలో ఆమె రాంభకిచా వద్ద తన కాన్వాయ్‌ను ఆపించారు. ప్రోటోకాల్ పక్కనబెట్టి వాహనం దిగి, భక్తులతో కలిసి పోయారు. తిరుమల సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం భక్తులతో కరచలనం చేసి ముచ్చటించారు. స్వయంగా భక్తులకు చాక్లెట్లు పంచారు. అయితే రాష్ట్రపతి కాన్వాయ్ నుంచి మధ్యలోనే దిగడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉంటే.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారం (నవంబర్ 21) తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేశారు. కాగా, అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరారు.