ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్‌ అధికారుల నోటీసులు..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం.. కేసీఆర్‌కు సిట్‌ అధికారుల నోటీసులు..!

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. 2023లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) తన పరిధిని విస్తృతం చేస్తోంది.

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా సాగిందన్న ఆరోపణలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా 618 మంది ఫోన్లు ట్యాప్ చేసి, రహస్యంగా సంభాషణలు విన్నారని తీవ్ర అభియోగాలున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి, సీరియస్‌గా విచారిస్తోంది ప్రభుత్వం. ఈ కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) తన పరిధిని విస్తృతం చేస్తోంది. రాజకీయ వ్యతిరేకులపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ అవకాశాన్ని గత ప్రభుత్వం వాడుకుందని, ఇందుకోసం స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఏర్పాటు చేసి జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు కూడా విన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

2024 మార్చి 10 డీఎస్‌పీ ప్రణీత్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ఫస్ట్ టైమ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, ఆధారాలను ధ్వంసం చేశారని, డీఎస్‌పీ ప్రణీత్‌రావుపై అడిషనల్ ఎస్‌పీ ఫిర్యాదు చేయడంతో కేసును టేకప్ చేసి విచారణ షురూ చేసింది సిట్. అదే నెల్లో ప్రణీత్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ అరెస్ట్ ప్రణీత్‌రావుదే. ఇక మాజీ SIB చీఫ్ టి. ప్రభాకర్‌రావును కింగ్‌పిన్‌గా భావిస్తూ, మరికొందరు అధికారులపై కూడా ఫోకస్ చేసింది సిట్. ఎవరు చెబితే ఫోన్లు ట్యాప్ చేశారు అని ఆరా తీసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో సైతం విచారణ చేపట్టారు. ట్యాపింగ్‌ కేసులో కీలకంగా మారిన ఫోరెన్సిక్ ఎవిడెన్స్, పాస్‌వర్డ్స్ సిట్‌కు అప్పగించాలంటూ ప్రభాకర్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావును స్వదేశానికి వచ్చాక, విడతల వారీగా విచారించింది సిట్.

సిట్ పిలుపు మేరకు రెండోసారి విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ MLC నవీన్‌రావు, మరిన్ని వివరాలు బైట పెట్టేశారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారని ఆయనే చెప్పారు. తర్వాత విషయం తెలిసిందే. జనవరి 20న మాజీ మంత్రి హరీష్‌రావును, 23న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నోటీసులిచ్చి పిలిపించి గంటల తరబడి విచారించింది సిట్. అరెస్టులు తప్పవన్న ఊహాగానాలు పెరగడంతో, పొలిటికల్ వాయిస్ రేజై, ఫోన్ ట్యాపింగ్‌పై కొత్తకొత్త ఆర్గ్యుమెంట్లు పుట్టుకొచ్చేశాయి. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు