వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. రిజర్వాయర్లు, చెరువులు అన్ని నిండు కుండలా మారడంతో.. కావాల్సినంత నీరు కాలువల్లో పారుతోంది. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద వరి అధికంగా సాగవుతుంది. ఒకవైపు వర్షాలు పడటం మరొకవైపు ప్రాజెక్ట్ ల్లో నీరు ఉండటంతో రైతులు ఉత్సాహంగా వరి సాగు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరి నాట్లు వేస్తున్నారు.
వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. రిజర్వాయర్లు, చెరువులు అన్ని నిండు కుండలా మారడంతో.. కావాల్సినంత నీరు కాలువల్లో పారుతోంది. దీంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద వరి అధికంగా సాగవుతుంది. ఒకవైపు వర్షాలు పడటం మరొకవైపు ప్రాజెక్ట్ ల్లో నీరు ఉండటంతో రైతులు ఉత్సాహంగా వరి సాగు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరి నాట్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు దాచేపల్లి వెళ్తున్నారు. అద్దంకి నార్కెట్ పల్లి హైవే పక్క నున్న పొల్లాల్లో రైతులు ఉత్సాహాంగా నాట్లు వేయడం కలెక్టర్ అరుణ్ బాబు కంట పడింది. వెంటనే ఆయన పొలాల పక్కనే కారు ఆపించారు. కారు దిగి నేరుగా రైతుల వద్దకు వెళ్లారు. వరి నాట్లు వేస్తున్న రైతు కూలీలు, రైతులతో మాటామంతి కలిపారు. ఇంకేంముంది రైతులతో కలిసి ఆయన కూడా పొలంలోకి దిగారు. ఏకంగా వరి నాటు వేశారు.
కలెక్టర్ ను చూసిన ఆనందంలో మహిళా కూలీలు ఆయనతో మాట్లాడేందుకు ముందుకొచ్చారు. ఇదే అదునుగా భావించిన కలెక్టర్ ఏం పంటలు సాగు చేస్తున్నారు. ఎంత దిగుబడి వస్తుందో వారినే అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది పొగాకు అధికంగా సాగు చేయడంతో ధర లేక రైతులు నష్టపోయిన విషయాన్ని ఆయనే ప్రస్తావించారు. ఈ ఏడాది పొగాకు సాగు చేయవద్దని సూచించారు. ఆతర్వాత పంట మార్పిడి విధానం అవలంభించాలన్నారు. వరితో పాటు మినుము లాంటి పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. అరుణ్ బాబు ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా ఆయనిచ్చిన సూచనలు, సలహాలను రైతులు, రైతు కూలీలు శ్రద్దగా విన్నారు.
ఈ ఏడాది ప్రాజెక్ట్ ల్లో పుష్కలంగా నీరుందని వాతావరణం కూడా అనుకూలంగా ఉందని.. రైతులంతా ఉత్సాహంగా సాగు చేయాలని కలెక్టర్ రైతులకు చెప్పారు. గ్రౌండ్ వాటర్ స్థాయి కూడా పెరిగిందన్నారు. హార్టికల్చర్ పంటలు కూడా సాగు చేయాలన్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.
కలెక్టరే ఏకంగా పొలంలోకి దిగడంతో ఆయనతో పాటు.. చాలామంది వరి పొలంలోకి దిగి నాట్లు వేశారు. తమతో జిల్లా ఉన్నతాధికారి కలిసి పొలంలో నాట్లు వేయడంతో మహిళా కూలీలు హర్షం వ్యక్తం చేశారు.