పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!

పహల్గాం ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. బంగారం వెలవెల..!

బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది కుంకుమ పువ్వును తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..కుంకుమ పువ్వు.. చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం.. చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. కేవలం వంటకు మాత్రమే కాదు.. సహజ సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. బిర్యానీ, స్వీట్లు, పాయసం తయారీలో ఎక్కువమంది తప్పనిసరిగా వాడుతుంటారు. అసలే ఖరీదైన ఈ కుంకుమ్మ ఇప్పుడు ధర ఇప్పుడు మరింతగా పెరిగింది. ఏకంగా బంగారాన్ని తలదన్ని దూసుకుపోతోంది. కేజీ కుంకుమ పువ్వు ధర ఇప్పుడు రూ.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఇందుకు కారణం ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

కశ్మీర్‌లో ఎర్ర బంగారం అని పిలుచుకునే ఈ కుంకుమ పువ్వు ధరకు ఒక్కసారిగా మన దేశంలో రెక్కలొచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్‌తో కుంకుమ పువ్వు ధర ఆకాశన్నంటుతోంది. ఎందుకంటే ఈ కుంకుమ పువ్వు ఎక్కువగా పహల్గాం ప్రాంతాల్లోనే పండిస్తారు. ఇప్పుడ ఉగ్రదాడి తర్వాత అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. వ్యాపారం, వాణిజ్యం అన్ని అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో భాగంగానే కుంకుమ పువ్వు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ధరలు చుక్కలంటుతున్నాయి.

ఇకపోతే, కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల అనారోగ్య సమస్యలకు కుంకుమ పువ్వు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, మలబద్ధకం, కాన్సర్, గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా అడ్డుకుంటుంది. కుంకుమ పువ్వుతో డిప్రెషన్, నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందని చెబుతున్నారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు