తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు ఉల్లిపాయల ధరలు భారీగా పడపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలపై వీటి ప్రభావం పడుతోంది. సరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల అనేక రంగాలపై ప్రభావం పడుతోంది.

ఉల్లిపాయలు లేనేది వంటిల్లో ఏ పని జరగదు. ఏ కూర వండాలన్నా ఉల్లి అనేది తప్పనిసరి. ఇవి లేకపోతే ఏ కూరకు టెస్ట్ రాదు. వంటల్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే ఉల్లి ధరలు పెరిగితే సామాన్యులందరినీ ప్రభావితం చేస్తోంది. ఉల్లి ధరలు గతంలో కేజీ రూ.100కిపైగా పలికి రికార్డ్ సృష్టించిన రోజులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. గల్ప్ దేశాల్లో యుద్ద పరిస్థితుల క్రమంలో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీని వల్ల సరఫరా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో గిట్టుపాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. పంటకు మద్దతు ధర లేక తెలుగు రాష్ట్రాల్లో రైతులు లబోదిబోమంటున్నారు.

రూ.100కి 8 కిలోలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.100కు 8 కిలోల ఉల్లిపాయలు మార్కెట్లలో ఇస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌లో నెల క్రితం క్వింటా ఉల్లి రూ.2 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.800 నుంచి 1400కి చేరుకున్నాయి. దీంతో పండించిన పంటకు ధర లేకపోవడంలో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇక ధర లేకపోవడం, కనీసం ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో రోడ్ల పక్కన పడేసి వెళ్లిపోతున్నారు. కనీసం పోలం నుంచి మార్కెట్‌కి తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులకు సరిపోయేంత కూడా రావడం లేనది బాధపడుతున్నారు.

పడిపోయిన టమాటా ధరలు
ఇక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల టమాటా దిగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో నిల్వ పెరగడం వల్ల వాటి ధరలు కూడా పడిపోయాయి. ప్రస్తుతం కేజీ టమాటా రూ.10కే లభిస్తోంది. టామాటా పంట వేసిన రైతులకు ఆదాయం రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పశువులకు మేతగా వీటిని వేస్తున్నారు. ట్రాక్టర్లలో తీసుకొచ్చి పశువులకు మేతగా వేసి వెళ్లిపోతున్నాయి. కొంతమంది రోడ్ల పక్కనే పడేసి వెళ్లిపోతున్నారు. యుద్దం ఎఫెక్ట్ దేశంలోని రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దిగుమతులకు ఆటంకం కలగడంతో రైతులకు నష్టం జరుగుతోంది. ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం లేకపోవడంతో ఉల్లి, టమాటా రైతులకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వాలు స్పందింది తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కనీసం మద్దతు ధర కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు