స్టార్ హీరో, విలన్ లేరు.. ఒక్క హీరోయిన్‏తోనే సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మూవీ..

స్టార్ హీరో, విలన్ లేరు.. ఒక్క హీరోయిన్‏తోనే సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మూవీ..

ప్రస్తుతం ఓటీటీల్లో విభిన్న కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాలకు పట్టం కడుతున్నారు. ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. స్టార్ హీరో, విలన్ లేకుండానే సత్తా చాటుతుంది.

2023లో విడుదలైన చిన్న కామెడీ సినిమా.. అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న కామెడీ సినిమా.. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు దూసుకుపోతుంది. అందులో స్టార్ హీరో, పవర్ ఫుల్ విలన్ లేరు. కేవలం ఒకే ఒక్క హీరోయిన్ ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ప్రస్తుతం ఆ మూవీ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో ట్రెండింగ్ లో ఉంది. ఆ సినిమా పేరు కథల్. ఇందులో సన్యా మల్హోత్రా ముఖ్యపాత్రలో నటించగా.. యశోవర్ధన్ మిశ్రా దర్శకత్వం వహించగా.. కామెడీ డ్రామాగా వచ్చి జనాలను ఆకట్టుకుంది.

కథ విషయానికి వస్తే.. నిజాయితీపరురాలు, చురుకైన పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన మహిమ (సన్య మల్హోత్రా). స్థానికంగా ఉండే రాజకీయ నాయకుడు (విజయ్ రాజ్ పోషించిన పాత్ర) ఇంట్లో రెండు అరుదైన పసన పండ్లు దొంగిలించబడతాయి. దీంతో ఈ కేసు మహిమ వద్దకు వస్తుంది. పైకి కనిపించేంత చిన్న విషయంగా అనిపించినా, త్వరలోనే రాజకీయ ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారుతుంది. నిజమైన నేరాలను పక్కన పెడితే మహిమను ఆ కేసును అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశిస్తారు ఉన్నతాధికారులు. మహిమ దర్యాప్తులో తప్పిన పనస పండ్లు అసలైన నిజాలను బయటకు తెస్తాయి. కుల వివక్షత, లింగ పక్షపాతం, పోలీసు దళంలోని రాజీలను తెలివిగా ప్రదర్శిస్తుంది. ఈ కేసులో ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న కేసులు బయటకు వస్తాయి. కామెడీ, కఠినమైన నిజాలను వెలికితీస్తాయి.

ఈ సినిమా ఉత్తమ హిందీ సినిమాగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ మొత్తం 9 అవార్డ్స్ అందుకుంది. థియేటర్లలో విడుదలైన రెండేళ్లకు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు