తుఫాన్ బీభత్సంలో చిక్కుకున్న గర్భిణి.. పురిటినొప్పులతో విలవిల.. అప్పుడు ఏం జరిగిందంటే..

తుఫాన్ బీభత్సంలో చిక్కుకున్న గర్భిణి.. పురిటినొప్పులతో విలవిల.. అప్పుడు ఏం జరిగిందంటే..

మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ప్రజలు ఇళ్లకే పరమితమయ్యారు. ఈదురు గాలులతో కురుస్తున్న ఎడతేరపిలేని భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు నేలమట్టమయ్యాయి.. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.. రోడ్లు దెబ్బతిన్నాయి.. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది..

మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ప్రజలు ఇళ్లకే పరమితమయ్యారు. ఈదురు గాలులతో కురుస్తున్న ఎడతేరపిలేని భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు నేలమట్టమయ్యాయి.. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి.. రోడ్లు దెబ్బతిన్నాయి.. పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది.. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఈ క్రమంలో.. చీకటి పడుతుండగా.. ఓ మహిళకు పురిటినొప్పులు మొదలవ్వడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.. వాగు పొంగి ప్రవహిస్తుండటంతో.. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది.. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టంగా మారింది.. ఈ క్రమంలోనే 108 పైలట్ చాకచక్యంతో గర్భిణి క్షేమంగా ఆసుపత్రికి చేరుకుంది. ఈ ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.

పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 పైలట్ సహాయం అందించాడు.. డుంబ్రిగుడ మం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సాకేరి అనితకు మంగళవారం సాయంత్రం పురిటినొప్పిలు మొదలయ్యాయి. మోంథా తుఫాన్ తీవ్రమైన సమయంలో ఆమెకు పురిటినొప్పులు మొదలవ్వడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.. దీంతో కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించారు. అరకులోయ ఆసుపత్రికి 108లో తరలించారు.. ఈ క్రమంలోనే.. మార్గమధ్యలో గెడ్డవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ వాహన రకపోకలకు అంతరాయం ఏర్పడింది.. దీంతో 108 సిబ్బంది పైలట్ సురేష్.. పురిటినొప్పులతో బాధపడుతున్న అనితను సురక్షితంగా వాగు దాటించారు. 104 సిబ్బంది సహాయంతో పైలట్ గర్భిణిని డుంబ్రిగుడ ఆసుపత్రిలో చేర్పించారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు