అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..

అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న లెక్కలు..

కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌గా మీనాక్షి మేడమ్ ల్యాండ్‌ అయ్యారు. సింపుల్‌గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్‌గానే కనిపిస్తున్నారు. వచ్చీరావడంతోనే పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్‌కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్‌గానే ఉంటానంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ మున్ముందు ఎలా ఉండబోతోంది…? పార్టీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి…?

హంగూలేదు.. ఆర్భాటమూ లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగు… వీపున చిన్న లగేజీ బ్యాగు…స్పెషల్‌ ఫ్లయిట్‌ లేదు.. కాన్వాయ్‌, సెక్యూరిటీ అసలే లేదు. ఓ సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్. వచ్చీ రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు… ప్రజల్లో ఉంటూ సిన్సియర్‌గా పని చేయాలన్నారు. పైరవీలు చేయడం కాదు… ఆ ఆలోచనే మైండ్‌ నుంచి తీసేయాలన్న హింట్‌ ఇచ్చారు. గ్రౌండ్ లెవల్‌లో పనిచేసేవారికే పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్‌గా చెప్పేశారు. మనిషి సాఫ్ట్‌గా కనిపించినప్పటికీ… పార్టీ విషయంలో వెరీ సీరియస్‌ అని తెలిసేలా ఫస్ట్‌ స్పీచ్‌తోనే అదరగొట్టారు మీనాక్షి నటరాజన్..

హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే… పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి. పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్టు గుర్తించారు. సీనియర్‌, జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. విభేదాలు, వివాదాలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నా ఆమె… కష్టపడ్డ ప్రతిఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు.

పార్టీ కోసం పనిచేయడం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఇటు సీఎం రేవంత్‌ రెడ్డి సైతం… విస్తృతస్థాయి సమావేశంలో సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీకోసం పనిచేయట్లేదన్న ఆయన… పోస్టులు రానివారు పదవి రాలేదని పనిచేయడం మానేశారంటూ ఫైర్ అయ్యారు. మంచి మైక్‌లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలన్న ఆయన… కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతలు మాత్రం చెడు మైక్‌లో, మంచి చెవిలో చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులొస్తాయన్నారు. అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు.

మొత్తంగా… కాంగ్రెస్‌ పార్టీలో ఇంతకుముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు. మరి కొత్త ఇన్‌చార్జ్‌ రాకతో మున్ముందు పార్టీ ఎలా ఉండబోతోంది…? ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి.

Please follow and like us:
తెలంగాణ వార్తలు