ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

ఓం భీం బుష్.. ఇంటికి లచ్చిందేవి వచ్చిందంటూ నమ్మించారు.. కట్‌చేస్తే..

కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు.

ఓ వైపు కొత్త కొత్త టెక్నాలజీలతో ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంటే.. కొంతమంది మాత్రం మూడ నమ్మకాల వలలో చిక్కుకొని లక్షల్లో డబ్బులు పోగొట్టు కుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. గుప్త నిధులు ఇప్పిస్తాం అని చెప్పి ఓ వ్యక్తి నుండి 5 లక్షల రూపాయలు కొట్టేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మెదక్ పోలీసులు.. వీరంతా అమాయకులను వలలో వేసుకుని.. గుప్త నిధులంటూ మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట (మం) కాట్రియాల గ్రామంలో గుప్త నిధుల పేరుతో ఒక వ్యక్తి నుండి డబ్బులు కాజేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కాట్రియాల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్దకు సిరిసిల్ల జిల్లాకు చెందిన కదకంచి రాజారాం, కద కంచి రాకేష్, సాదుల అశోక్ అనే ముగ్గురు దుండగులు వెళ్ళి మీ ఇంట్లో బంగారం ఉందని, పూజలు చేస్తే బంగారం బయటకు వస్తుందని నమ్మబలికారు. దీనికి ఖర్చు అవుతుందని వివరించారు. విడతల వారీగా అతని నుండి 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని పూజలు చేశారు.

కానీ గుప్తా నిధులు మాత్రం బయట పడలేదు.. దీనితో చాలా రోజులు వెయిట్ చేసిన బాధితుడు..చివరికి మోసపోయాను అని తెలుసుకొని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి ఐదు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు