బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..

బెస్ట్ ఫ్రెండ్ సినిమాపై మహేష్ ప్రశంసలు.. అస్సలు మిస్ అవ్వదన్న సూపర్ స్టార్..

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరోనో అంతే మంచి మనిషి.. సాయంలోనే కాదు తన సినిమాలతో పాటు పక్కవారి సినిమాలను కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా తన సపోర్ట్ అందిస్తూ ఉంటారు. ఇప్పటికే మహేష్ బాబు ఎన్నో సినిమాల టైటిల్స్, టీజర్లు, సాంగ్స్ ను రిలీజ్ చేశారు. అలాగే తాను చూసిన సినిమా ఏదైనా మంచిగా అనిపిస్తే వెంటనే సోషల్ మీడియా వేదికగా ఆ సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతారు మహేష్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ఓ ఎమోషనల్ డ్రామా పై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే కుబేర సినిమా పై ప్రశంసలు కురిపించిన మహేష్ తాజాగా మరో సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సినిమా ఏ దంటే..

ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమాల్లో అనగనగ సినిమా ఒకటి. సుమంత్, కాజల్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమంత్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బాండ్ ను చక్కగా చూపించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపించాడు.

సోషల్ మీడియాలో మహేష్ బాబు అనగనగా సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ..”అనగనగా’.. చక్కని, ఎమోషనల్ కథను అందంగా తెరకెక్కించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా కోసం మీరు తప్పక సమయాన్ని కేటాయించాలి. సుమంత్‌తోపాటు టీమ్‌ అందరూ అద్భుతంగా వర్క్‌ చేశారు. అందరికీ నా ప్రేమను, అభినందనలను తెలియజేస్తున్నా.. ” అంటూ మహేష్ బాబు రాసుకొచ్చారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు