చిక్కుల్లో లేటెస్ట్ సూపర్ హిట్ డ్యూడ్.. సినిమా పై కేసు.. వేసింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

చిక్కుల్లో లేటెస్ట్ సూపర్ హిట్ డ్యూడ్.. సినిమా పై కేసు.. వేసింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హీరోగా సక్సెస్ అయిన ఆయన.. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రదీప్ వ్యక్తిగత విషయాలు, సంపాదన గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
చిక్కుల్లో లేటెస్ట్ సూపర్ హిట్ డ్యూడ్.. సినిమా పై కేసు.. వేసింది ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇటీవల విడుదలైన డ్యూడ్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వరుస హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ప్రదీప్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మంచి విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా దూసుకుపోతుంది డ్యూడ్ సినిమా.. ఇదిలా ఉంటే డ్యూడ్ సినిమా పై కేసు వేశారు. డ్యూడ్ పై కేసు వేసింది ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్
లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డ్యూడ్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. ఈ సినిమా పై కోర్టులో దవా వేశారు. దవా వేసింది ఎవరో కాదు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. డ్యూడ్‌ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన ‘పుదు నెల్లు పుధు నాతు’ పాటను వాడారు. సినిమాలోని ఓ పెళ్లి సన్నివేశంలో ఈ పాటను ఉపయోగించారు. దాంతో ఆయన సినిమా పై కేసు వేశారు. గతంలోనూ ఇళయరాజా కొన్ని సినిమాల పై కేసు వేశారు. తన పాత పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో వాడుకున్నారని పలు సినిమాల పై దవా వేశారు ఇళయరాజా..

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..
డ్యూడ్‌ సినిమా విషయంలో దావా వేసేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. డ్యూడ్ సినిమాలో కరుతమచ్చన్ అనే సినిమాలోని పుదు నెల్లు పుధు నాతు అనే పాటను సినిమాలో ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు పెళ్లి సమయంలో వాడుకున్నారు. ఇందుకోసం అనుమతి తీసుకోలేదని తెలియడంతో దావా వేసేందుకు ఇళయరాజాకు కోర్టు అనుమతి ఇచ్చింది. డ్యూడ్ సినిమా లో తన అనుమతి లేకుండా తన సినిమా పాటలను ఉపయోగించారని మద్రాస్ హైకోర్టు ని ఆశ్రయించారు సంగీత దర్శకుడు ఇళయరాజా.. కాగా ఇళయరాజా పిటిషన్ ని స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న విడుదలైన డ్యూడ్ సినిమాకు కొత్త డైరెక్టర కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు