చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

చల్ల చల్లని కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.. వచ్చే రెండు రోజులు తెలంగాణతోపాటు.. ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో భిన్న వాతావరణం నెలకొంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది.. వచ్చే రెండు రోజులు తెలంగాణతోపాటు.. ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రోజు తెలంగాణలోని కొమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాలపల్లి, కరీంనగర్, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది

ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.8, కనిష్టంగా హనుమకొండలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. గురువారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్.. 41.9, నిజామాబాద్.. 41.2, ఆదిలాబాద్.. 40.8, నల్లగొండ.. 38.5, రామగుండం.. 38.4, మహబూబ్ నగర్.. 37.5, ఖమ్మం.. 37, హైదరాబాద్.. 37, హనుమకొండ.. 36, భద్రాచలం.. 35.6, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పై 9 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో మండుటెండలు.. వర్షాలు
ఏపీలో మండుటెండలు.. మరోవైపు వర్షాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం, శనివారం పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. గురువారం నంద్యాల జిల్లా గోస్పాడు. రుద్ర వరంలో 42.1 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, వైఎస్సార్ జిల్లా వేం పల్లెలో 41.5, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.4, కర్నూలులో 40.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 40.3, అన్నమయ్య జిల్లా పుత్తనవారిపల్లెలో 40 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36 ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా రికార్డ్ అయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ రోజు అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం, చింతూ రు మండలాల్లో వడగాల్పుల ప్రభావంచూపే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లో తీవ్రవడ గాలులు.. 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచిమోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు