ఆల్మట్టి ఎత్తు పెంపుతో కన్నడనాట సిరులు.. ముంపులో మరాఠీలు.. తెలుగోళ్లు మాడతారు!

ఆల్మట్టి ఎత్తు పెంపుతో కన్నడనాట సిరులు.. ముంపులో మరాఠీలు.. తెలుగోళ్లు మాడతారు!

. ఆల్మట్టి జస్ట్‌ ఐదు అడుగులు పెరిగితే.. తెలంగాణ కృష్ణానది పరివాహకం మొత్తం ఎడారిగా మారిపోతుంది. కట్టిన ప్రాజెక్టులు క్రికెట్‌ ఆడుకునే గ్రౌండ్స్‌గా మారిపోతాయి. తెలంగాణలోనే నీళ్లు పారకపోతే ఇక ఏపీ పరిస్థితి..! రాయలసీమ కొన వరకు కృష్ణా నది నీళ్లు పారుతున్నాయి. వాటి సంగతేంటి? అసలు.. ఈ ఐదడుగుల రగడ ఏంటి? ఏపీ బనకచర్ల కడితే.. కృష్ణాలో 64 టీఎంసీలు వెనక్కిచ్చేయాలంటోంది కర్ణాటక. ఎక్కడో ఆల్మట్టికి, రాయలసీమలోని బనకచర్లకు లింక్ ఏంటి?

వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు అడిగాడు. ఓస్‌.. మూడడుగులే కదా అని తేలిగ్గా తీసుకున్నాడట. బలిని పాతాళంలోకి తొక్కి, నింగి-నేల ఆక్రమించేశాడు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఐదడుగులు అడుగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌ కోసం..! అక్కడ తొక్కితే.. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ మూడు రాష్ట్రాల ప్రజల గొంతు తడారిపోతుంది. ఆల్మట్టి జస్ట్‌ ఐదు అడుగులు పెరిగితే.. తెలంగాణ కృష్ణానది పరివాహకం మొత్తం ఎడారిగా మారిపోతుంది. కట్టిన ప్రాజెక్టులు క్రికెట్‌ ఆడుకునే గ్రౌండ్స్‌గా మారిపోతాయి. తెలంగాణలోనే నీళ్లు పారకపోతే ఇక ఏపీ పరిస్థితి..! రాయలసీమ కొన వరకు కృష్ణా నది నీళ్లు పారుతున్నాయి. వాటి సంగతేంటి? అసలు.. ఈ ఐదడుగుల రగడ ఏంటి? ఏపీ బనకచర్ల కడితే.. కృష్ణాలో 64 టీఎంసీలు వెనక్కిచ్చేయాలంటోంది కర్ణాటక. ఎక్కడో ఆల్మట్టికి, రాయలసీమలోని బనకచర్లకు లింక్ ఏంటి? అన్నదీ తెలుసుకుందాం.. నైరుతి మొదలవడం ఆలస్యం.. గోదావరి ఉప్పొంగుతుంటుంది. దాదాపుగా జూన్‌లోనే గోదావరి ప్రాజెక్టుల్లో జలకళ కనిపిస్తుంది. ఓవైపు ఇలా ఉంటే.. కృష్ణానది మాత్రం ఎడారిలా కనిపిస్తుంటుంది. ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీలో ఉంటాయి. ఒకే రాష్ట్రంలో రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. కారణమేంటి? గోదావరితో పోల్చితే కృష్ణానది ప్రాజెక్టులకి రెండు నెలలు ఆలస్యంగా నీళ్లు రావడమే. దీనికి కారణం.. ఎగువన కర్ణాటకలో కట్టిన ప్రాజెక్టులే. కన్నడనాట జోరు వానలు, వరదలు ముంచెత్తుతున్నా.. తెలంగాణ గడ్డపైకి మాత్రం చుక్కనీరు రాదు. కారణం.. కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్ట్. ఆల్రడీ కృష్ణా ప్రాజెక్టులకి ఎంత నష్టం జరుగుతోందో…

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు