ఒకప్పుడు సినీప్రపంచంలో ఆమె తోపు హీరోయిన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ టాప్ క్రికెటర్ ను ప్రేమించి సినిమాలు వదిలేసింది. కానీ ఇప్పుడు ఆమె 1300 కోట్లకు మహారాణి..
సినీరంగుల ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్. ఎలాంటి సపోర్ట్ లేకుండానే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మెప్పించింది. టాప్ హీరోల సరసన బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ స్టార్ క్రికెటర్ ను ప్రెమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అనుష్క శర్మ. బాలీవుడ్ బాద్ షా నటించిన రబ్ నే బనా ది జోడి సినిమాతో ఇండస్ట్రీలోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుని అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఆమె దేశవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంది. 2008లో షారుఖ్ ఖాన్ సరసన అనుష్క తొలిసారిగా నటించింది.
ఆ తర్వాత బ్యాండ్ బాజా బారాత్, పికె, సుల్తాన్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే నిర్మాతగా మారి NH10 అనే ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించింది. అనుష్క సినిమాలు, వ్యాపారం రెండింటిలోనూ బలమైన ఉనికిని కలిగి ఉంది. నివేదికల ఆమె సంపాదన రూ.225 కోట్లు. నటన, బ్రాండ్ ఒప్పందాలు, ఫ్యాషన్ లేబుల్స్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కోసం వర్క్ చేసింది. ఆమె నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ ద్వారా సంపాదిస్తుంది.
ఆమెకు ముంబైలోని వర్లిలో రూ.9 కోట్ల విలువైన ఫ్లాట్, ఢిల్లీలో ఒక ఇల్లు ఉన్నాయి. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2017లో వీరిద్దరి వివాహం జరగ్గా.. వామిక, అకాయ్ జన్మించారు. ఆమెకు అలీబాగ్‌లో రూ.19 కోట్ల విలువైన రెండు ఆస్తులు కూడా ఉన్నాయి. విరాట్, అనుష్కల నికర విలువ రూ. 1300 కోట్లకు పైగా ఉందని అంచన. భారతదేశంలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటలలో వీరు ఒకటి. అనుష్క చివరి పూర్తి సినిమా పాత్ర జీరో (2018). ఆమె ఖాలా (2020) లో అతిధి పాత్రలో నటించింది.