పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..

పండగ పూట చుట్టాల ఇంటికి వెళ్లిన బాలుడు.. పతంగి ఎగురవేసిన పాపానికి.. ఏం జరిగిందంటే..

సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పండుగ ఆనందం విషాదంగా మారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంక్రాంతి పండగ అంటేనే రంగుముగ్గులు, పిండివంటలు, పతంగులు.. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందాన్ని పొందుతారు. కానీ, చాలా చోట్ల ఆ ఆనందం విషాదంగా మారుతోంది. గాలి పటం ఎగరవేయడం చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. పండుగ పూట ఓ ఇంట విషాదం నెలకొంది..సరదాగా గాలి పటం ఎగురవేస్తున్న ఒక బాలుడు ఊహించని ప్రమాదంలో పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగి విషాద సంఘటన వివరాల్లోకి వెళితే…

సంక్రాంతి పండుగ వేళ గాలిపటం ఆ ఇంట విషాదాన్ని నింపింది..ఆ పసివాడి పాలిట శాపమై ప్రమాదంలోకి నెట్టింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూరు గ్రామంలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది..మెదక్ జిల్లా చిలచ్చెడ్ మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన స్వప్న, తన ఆరేళ్ల కుమారుడు అరవింద్ తో కలిసి డాకూరులోని బంధువులైన గడ్డమీది సుగ్రీవ్ ఇంటికి వచ్చారు. సంక్రాంతి పండుగ కావడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో బాలుడు అరవింద్ ఉత్సాహంగా గాలి పటం ఎగురవేస్తున్నాడు..

ఈ క్రమంలోనే గాలిపటం అక్కడే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు చిక్కుకుకుంది…ఆ తీగలకు తగిలిన గాలిపటాన్ని బాలుడు గట్టిగా లాగడంతో, మాంజా ద్వారా అరవింద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో అరవింద్ ఒళ్లంతా కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి కాపాడే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు..ప్రస్తుతం అరవింద్ మృత్యువుతో పోరాడుతున్నాడు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు