హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి అందుబాటులో రానుంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ప్రకటనలో తెలిపారు. 10.07.2025 నుంచి కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యం 530 నుండి 1,128కి పెరగనుంది. రైలు నెం. 20703/20704 కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ మధ్య నడిడే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 08 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టారు.. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. సాధారణ సర్వీసులు ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు 100శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహంతో స్థిరంగా నడుస్తోంది.
దీంతో ఈ రైలుకు పెరిగిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, రైల్వే ఇప్పటికే ఉన్న రైలు బోగిలు 08కి అదనపు కోచ్‌లను జత చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, జూలై 10, 2025 నుంచి ప్రస్తుత 08 కోచ్‌ల సామర్థ్యంతో కాకుండా 16 కోచ్‌ల సామర్థ్యంతో రైలును నడపడానికి ప్రణాళికలు చేశారు. కొత్త కోచ్‌లతో 1024 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 14 చైర్ కార్లు, 104 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగిలు అందుబాటులోకి రానున్నాయి.. మొత్తం 1128 ప్రయాణికులు సామర్థ్యంతో కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది..
కాగా.. 2023 సెప్టెంబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి ఈ రైలు అధిక డిమాండ్ తో పరుగులు తీస్తోంది. పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. కోచ్ లను 16కు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కోచ్‌ల రెట్టింపుతో, ఐటీ నగరాలైన హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఇప్పుడు ఎక్కువ మంది రైలు ప్రయాణికులు వందే భారత్ రైలు సేవలను పొందగలరని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.