యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..

యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..

జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు పెట్టారు.

జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు పెట్టారు. జనం గుడ్ల కోసం పరుగులు పెడుతుండడంతో ఆ డీసీఎం ఓనర్ తో సహా పోలీసులు ఆ గుడ్లు ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఈ ప్రమాదం బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై దేవరుప్పుల మండలం మాన్సింగ్ తండా వద్ద జరిగింది.. TS 08 UF 3777 నెంబర్ గల DCM వ్యాన్ జనగామ నుంచి సూర్యాపేటకు కోడిగుడ్ల లోడ్ తో వెళ్తుంది.. ఈ క్రమంలో కోడిగుడ్ల లోడ్‌తో వెళ్తున్న డీ.సీ.ఏం వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో కోడి గుడ్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.

వేల సంఖ్యలో గుడ్లన్నీ రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోవడంతో ఆ మార్గంలో వెళ్తున్న వారంతా గుడ్లను ఎత్తుకుపోయేందుకు పరుగులు పెట్టారు.. పక్కనే ఉన్న తండావాసులు గుడ్ల కోసం ఒక్కపరుగున అక్కడికి చేరుకున్నారు.. చెల్లాచెదురుగా పడిపోయిన కోడిగుడ్లను ఏరుకుని.. కొందరు పండుగ చేసుకున్నారు.

అయితే.. గుడ్ల కోసం జనం అక్కడికి వస్తుండటం చూసి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.. విషయం తెలిసిన వెంటనే DCM వ్యాన్ ఓనర్ తో సహా, సిబ్బంది అక్కడికి చేరుకుని వాటిని వేరొక వాహనంలోకి ఎక్కించి తరలించే ప్రయత్నం చేశారు.. అయితే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పేర్కొంటున్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు