ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్ మిషన్ కోసం కీలక పరీక్షను కూడా నిర్వహించనుంది. తక్కువ ఖర్చుతో సాంకేతికత అందిస్తూ ఇస్రో ప్రపంచ అంతరిక్ష రంగంలో తన సత్తా చాటుతోంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఓవైపు స్వదేశీ అవసరాల కోసం కీలక ప్రయోగాలు చేపడుతూనే మరోవైపు ప్రపంచ దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెడుతూ కమర్షియల్ ప్రయోగాల్లోనూ సత్తా చాటుతోంది. ఒకప్పుడు భారీ ఉపగ్రహాలను ప్రయోగించాలంటే రష్యా లాంటి దేశాలపై భారత్ ఆధారపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలకు అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఒక ఆశాకిరణంలా కనబడుతోంది. 2025లో కీలక ప్రయోగాలను చేపట్టిన ఈశ్వరు ఏడాది చివరణ డిసెంబర్లో మరికొన్ని కీలక ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2025 డిసెంబర్ నెలలో మరో రెండు కీలక రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే డిసెంబర్ మొదటి వారంలో అమెరికా దేశానికి చెందిన బ్లూ బార్డర్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పిలవబడే ఎల్విఎం3 m6 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ సాటిలైట్ బ్లూ బోర్డ్ ఉపగ్రహాన్ని డిసెంబర్ మొదటి వారంలో శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.

గడిచిన ఐదేళ్లలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అమెరికాకు చెందిన అనేక కీలక ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇతర దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి టెక్నాలజీ భారత్ సొంతం చేసుకోవడంతో కమర్షియల్ ప్రయోగాలకు ఇస్రో మంచి డిమాండ్ కలిగి ఉన్న సంస్థగా ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించాయి. ప్రస్తుతం అమెరికా కూడా కీలక ప్రయోగం కోసం భారత్‌ను ఎంచుకుంది.

ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులను షార్ లోని వెహికిల్ ఆసెంబ్లింగ్ బిల్డింగ్‌లో శాస్త్రవేత్తలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే డిసెంబర్ చివరి వారంలో పిఎస్ఎల్వీసి 62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం ద్వారా ఓషన్ సాట్ 3A ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ఈ PSLV C 62 కు సంబంధించి షార్‌లోని రెండవ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గగన్యాన్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి దశలవారీగా జరుగుతున్న ప్రయోగాత్మక ప్రయోగాల్లో ఒకటైన కీలక ప్రక్రియ కూడా డిసెంబర్‌లోనే జరిగే అవకాశం ఉంది.

తొలిసారిగా భారత్ మానవ సహిత ప్రయోగానికి సిద్ధమవుతున్న క్రమంలో ఇస్రో కీలక పరీక్షలు చేపడుతుంది. అన్ని పరీక్షలు విజయవంతమయ్యాకే అసలు ప్రయోగం చేపట్టాలని ఇస్రో ముందే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే 20 కి పైగా ప్రయోగాత్మక ప్రయోగాలను ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలో మరో ప్రయోగం కూడా డిసెంబర్‌లోనే జరిగే అవకాశం ఉంది. గగన్‌యాన్ G1 రాకెట్ ప్రయోగాన్ని కూడా చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా 2026 జనవరి మాసంలో పిఎస్ఎల్వి సిరీస్‌లో న్యూటెక్నాలజీతో పిఎస్ఎల్వీ N1 రాకెట్ ప్రయోగాన్ని కూడా చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు