ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీ.. వివరాల్లోకి వెళ్తే..

దసరా సెలవులు రానున్నాయి. దీంతో చాలా మంది తమ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC రకరకాల టూర్ ప్యాకేజీలను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు కోనసీమ వాస్తులకు అందుబాటులో ఉండే విధంగా వైజాగ్ నుంచి నాలుగు గమ్యస్థానాలకు విమాన పర్యటనలను ప్రకటించింది. కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు టూర్ ప్యాజీలను ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..

దసరా సెలవుల నేపధ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం నుంచి కేరళ, రాజస్థాన్, చార్ ధామ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులకు విమాన ప్యాకేజీ పర్యటనలను ప్రకటించింది. ఈ విషయంపై గురువారం IRCTC/BBS జాయింట్ జనరల్ మేనేజర్ క్రాంతి పి. సావర్కర్ మాట్లాడుతూ.. టూర్ ప్యాకేజీ గురించి అనేక విషయాలు చెప్పారు. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఇచ్చే సదుపాయాలను.. సేవలను తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ-క్లాస్ విమాన టిక్కెట్లు, 3 స్టార్ హోటల్ వసతి, అల్పాహారం, విందు, ఎయిర్ కండిషన్డ్ వాహనాలలో ప్రయాణంతో పాటు.. టూర్ షెడ్యుల్ లోని ప్రణాళిక ప్రకారం సైట్ సీయింగ్, షేరింగ్ ప్రాతిపదికన, ప్రయాణ బీమా సదుపాయాన్ని అందించనున్నారు.

కేరళ టూర్ విశేషాలు: ‘సీనిక్ కేరళ’ టూర్ ప్యాకేజీలో భాగంగా కొచ్చి, మున్నార్, తెక్కడి, కుమారకోమ్, శ్రీ పద్మనాభ స్వామి ఆలయం సందర్శించవచ్చు. ఈ టూర్ ఆరు రాత్రులు/ఏడు పగళ్ల ఉండనుంది. సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు ఉంటుంది. టికెట్ ధరలు: సింగిల్ ఆక్యుపెన్సీ – రూ. 52,590, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 38,030, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 36,380.

రాజస్థాన్ టూర్ విశేషాలు ‘రాయల్ రాజస్థాన్’ టూర్ ప్యాకేజీ గా అందిస్తున్న ఈ టూర్ లో జైపూర్, బికనీర్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయపూర్, మౌంట్ అబు, పుష్కర్ , అజ్మీర్ వంటి ప్రాంతాలను సందర్శించనున్నారు. తొమ్మిది రాత్రులు, 10 పగళ్ళు సాగనున్న ఈ పర్యటన అక్టోబర్ 9 నుంచి 18 వరకు ఉంటుంది. టికెట్ ధరలు: రూ. 77,375 (సింగిల్ ఆక్యుపెన్సీ), డబుల్ ఆక్యుపెన్సీ రూ. 60,155, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 56,100 గా నిర్ణయించబడింది.

చార్ ధామ్ యాత్ర విశేషాలు చార్ ధామ్ యాత్రలో బద్రీనాథ్, బార్కోట్, గంగోత్రి, గుప్త కాశి, హరిద్వార్, కేదార్నాథ్, సోన ప్రయాగ, యమునోత్రి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం. ఈ పర్యటన 11 రాత్రులు.. 12 రోజుల పాటు సాగుతుంది. ఒక వ్యక్తికి రూ. 81,545 ,డబుల్ ఆక్యుపెన్సీ రూ. 71,760, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 67,845 చెల్లించాల్సి ఉంటుంది.

అండమాన్ అండ్ నికోబార్ ‘LTC అండమాన్ ఎమరాల్డ్స్’ టూర్ పోర్ట్ బ్లెయిర్, రాస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్, హేవ్‌లాక్ ఐలాండ్ , నీల్ ఐలాండ్‌లను ఈ టూర్ లో కవర్ చేయవచ్చు. టికెట్ ధరలు: సింగిల్ ఆక్యుపెన్సీ రూ. .67,165, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 50,570, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 48,990 గా నిర్ణయించబడింది.

ఆసక్తి ఉన్నవారు తమ టిక్కెట్లను IRCTC కార్యాలయం, ప్రధాన ప్రవేశ ద్వారం, గేట్ నంబర్ 1, విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం సాయి ప్రసాద్ మొబైల్ నంబర్ 9281495847, కె. వెంకటేశ్వరరావు మొబైల్ నంబర్ 9550166168 లేదా చందన్ కుమార్ మొబైల్ నంబర్ 9281030748 నుంచి పొందవచ్చు. లేదా మరిన్ని వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు