సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు

సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో..

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి ఎంతో మేలు జరుగనుంది. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానాకి జీవిత బీమా అమలు చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ 2026-27 ప్రసంగంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకంకు సంబంధించి ప్రకటన చేశారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు.. విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం..

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో అమలు చేయబోయే పలు కొత్త పథకాలను కూడా ప్రకటించారు. అందులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఒకటి.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఈ ఏడాది జూన్ 2న ప్రారంభించనున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్‌ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 15 లక్షల కుటుంబాలను లబ్దిదారులుగా ఉన్నారని, సామాజిక విభేదాలు లేదా ఆర్థిక స్థితితో (పేద, మధ్యతరగతి, ధనిక) సంబంధం లేకుండా ఈ పథకం పౌరులందరికీ వర్తిస్తుందని తెలిపింది. సామాన్యుడి జీవితానికి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.

బీమా ఎప్పటి నుంచి అమలు: అయితే రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలో ఆదాయం తీసుకువచ్చే వ్యక్తి ఏదైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డునపడే పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ పథకానికి శ్రీకారం చూడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వం అమలు చేసే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు ఎంతగానో మేలు జరుగనుంది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబ రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి. ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో అలాంటి కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు