డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్..
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA).. జులై 2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.. ప్రవేశాలు కల్పిస్తారు. 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీటెక్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అవివాహిత పురుష అభ్యర్ధులు గడువు తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్స్ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 56,400 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.