ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. పెళ్లికాని, పెళ్లైన అబ్బాయిలకు మాత్రమే ఛాన్స్‌

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. పెళ్లికాని, పెళ్లైన అబ్బాయిలకు మాత్రమే ఛాన్స్‌

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ ‘Y’ మెడికల్ అసిస్టెంట్, ఎయిర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివాహిత, అవివాహిత పురుష అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. గ్రూప్ ‘Y’ మెడికల్ అసిస్టెంట్, ఎయిర్‌మెన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వివాహిత, అవివాహిత పురుష అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్‌తో పాటు BSC (ఫార్మసీ) లేదా ఫార్మసీలో డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా జనవరి 1, 2006 నుంచి జనవరి 1, 2010 మధ్య జన్మించి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవివాహిత పురుష అభ్యర్థులు BSC (ఫార్మసీ)/ఫార్మసీలో డిప్లొమా కలిగి ఉండాలి. 1 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి. ఫార్మసిస్ట్ వివాహిత అభ్యర్ధులైతే BSC (ఫార్మసీ)/ఫార్మసీలో డిప్లొమాతోపాటు 1 జనవరి 2003 నుంచి 1 జనవరి 2006 మధ్య (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండాలి.

ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్ ‘Y’ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌లో ఎయిర్‌మెన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 1, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్- 2, మెడికల్ ఎగ్జామ్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతక వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు