తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కోమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఆరేంజ్ అలెర్ట్ ఉన్న జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు గరిష్టంగా మెదక్ లో 42, కనిష్టంగా హైదరాబాద్ లో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, రామగుండం, ఖమ్మం, భద్రాచలం లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిన్న జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు..
మెదక్ జిల్లాలో- 42.9 డిగ్రీలు నిజామాబాద్- 41.5 డిగ్రీలు ఆదిలాబాద్- 41.3 డిగ్రీలు నల్లగొండ- 41 డిగ్రీలు రామగుండం- 40.6 డిగ్రీలు ఖమ్మం- 40.4 డిగ్రీలు భద్రాచలం- 40.2 డిగ్రీలు మహబూబ్ నగర్- 39 డిగ్రీలు హైదరాబాద్- 38.7 డిగ్రీలు హనుమకొండ- 38 డిగ్రీలు
ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ వాసులకు ఇవాళ ఎండ నుంచి కాస్త ఉపసమనం కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండనున్నట్టు ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.