ఆహా.! ఎంత చల్లచల్లని కబురు.. ఉరుములతో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే

ఆహా.! ఎంత చల్లచల్లని కబురు.. ఉరుములతో భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే

కాస్కోండి… ఇక వానలే వానలు…! రాబోయే రెండ్రోజుల వర్షబీభత్సనానికి.. నిన్నా-ఇవాళ కురిసిన వర్షాలే చిన్న శాంపిల్‌ అన్న సంకేతాలిచ్చాడు వరుణుడు రాగల 48 గంటలు వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ వార్నింగ్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం గత 3 గంటల్లో గంటకు 13 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, 0730-0830 గంటల మధ్య పశ్చిమ బెంగాల్ దాని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను దాటింది. ఈరోజు జూలై 25న 0830 గంటల సమయానికి పశ్చిమ బెంగాల్ తీరప్రాంతం, వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై దాదాపుగా 21.7°ఉత్తర అక్షాంశం, 88.8° తూర్పు రేఖాంశంల దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఖేపుపారా (బంగ్లాదేశ్)కి పశ్చిమ-నైరుతి దిశలో 150 కి.మీ.. కానింగ్ (పశ్చిమ బెంగాల్)కి దక్షిణ-ఆగ్నేయంగా 60 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్)కి తూర్పున 80 కి.మీ. కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)కి దక్షిణ-ఆగ్నేయంగా 100 కి.మీ. దూరంలో ఉంది.

ఇది రాబోయే 24 గంటల్లో గంగా నది పశ్చిమ బెంగాల్ దాని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ద్రోణి ఇప్పుడు హర్యానా, దాని పరిసర ప్రాంతాల మీదుగల ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయుగుండం కేంద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న ఒడిశా అంతర్గత ప్రాంతాల మీదుగల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 4.5 & 5.8 కి.మీ మధ్య ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు..

—————————————————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————————
ఈరోజు :- —
———————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

రేపు :- —————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:- —————–
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–
ఈరోజు :- —
————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:- ————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

రాయలసీమ :- ——————-
ఈరోజు, రేపు :-
—————————————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి :- ———-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు