ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ప్రిలిమ్స్ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ప్రిలిమ్స్ 2025 రాత పరీక్షలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ప్రిలిమ్స్ రాత పరీక్షలు ఆగస్టు 17, 23, 24 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
ఆగస్ట్ 19, 20 తేదీల్లో తెలంగాణ డీఈడీ సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆగస్టు 19, 20 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 235 ప్రభుత్వ డైట్ కళాశాలల్లో, 579 ప్రైవేటు కళాశాలల్లో సీట్లు మిగిలిపోయినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రటకనలో తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి మొత్తం 1,131 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ సీట్లకు ఆగస్ట్ 19న, ప్రైవేటు సీట్లకు ఆగస్ట్ 20న ఆయా కళాశాలల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, అర్హత కలిగిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందొచ్చని తెలిపారు.
తెలంగాణ ఎడ్‌సెట్ రిపోర్టింగ్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
తెలంగాణ ఎడ్‌సెట్ తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేసే గడువును ఆగస్టు 20వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, సెలవుల కారణంగా ఈ గడువును పెంచినట్లు తెలిపారు.