నిరుద్యోగ యువతకు ఎగిరి గంతేసే న్యూస్.. గురువారం మెహిదీపట్నంలో మెగా జాబ్‌ మేళా!

నిరుద్యోగ యువతకు ఎగిరి గంతేసే న్యూస్.. గురువారం మెహిదీపట్నంలో మెగా జాబ్‌ మేళా!

హైదరాబాద్ యువతకు పోలీసుల నుంచి సూపర్‌ గుడ్‌ న్యూస్ వచ్చింది. పోలీస్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిరుద్యోగుల కోసం ఒక భారీ ఉద్యోగ మేళాను నిర్వహించబోతున్నారు. డెక్కన్ బ్లాస్టర్స్‌ అనే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామ్యంతో ఈ మెగా జాబ్‌

హైదరాబాద్ యువతకు పోలీసుల నుంచి సూపర్‌ గుడ్‌ న్యూస్ వచ్చింది. పోలీస్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిరుద్యోగుల కోసం ఒక భారీ ఉద్యోగ మేళాను నిర్వహించబోతున్నారు. డెక్కన్ బ్లాస్టర్స్‌ అనే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామ్యంతో ఈ మెగా జాబ్‌ ఫెయిర్‌ను అక్టోబర్‌ 30న మెహదీపట్నం రూప్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్‌ 30న (గురువారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ మేళాలో ఐటీ, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, ఫార్మసీ, ప్రైవేట్‌ ఇండస్ట్రీలు వంటి అనేక రంగాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. కొత్తగా కెరీర్‌ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్‌కి, అలాగే అనుభవం ఉన్న అభ్యర్థులకు కూడా తగిన అవకాశాలు లభించనున్నాయి.

పదో తరగతి నుంచి ఏ విద్యార్హత ఉన్నా హాజరవ్వొచ్చు..
SSC, ITI, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, BTech, BPharm, లేదా MPharm వంటి అర్హతలు కలిగిన పురుషులు, మహిళా అభ్యర్ధులు ఎవరైనా ఈ జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చు. ఇది కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల యువత కూడా తమ సర్టిఫికెట్లు, వ్యక్తిగత వివరాలతో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరుల గౌరవ సూచకంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిరుద్యోగులు, అర్హత కలిగిన యువత పైన పేర్కొన్న అడ్రస్‌లో జరిగే ఉద్యోగ మేళాకు హాజరు కావాలని అధికారులు కోరుతున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు