కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసిన కొండచిలువ.. తృటిలో తప్పించుకున్న షాప్‌ యజమాని..

కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసిన కొండచిలువ.. తృటిలో తప్పించుకున్న షాప్‌ యజమాని..

మహబూబాబాద్ జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది. నాటు కోళ్ల పెంపకం దారుడి షాప్ లోకి చొరబడి కోళ్లను మింగేసింది. కొండచిలువను చూసి తీవ్ర భయాందోళన చెందిన స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకొని అడవుల్లో వదిలేశారు.

వర్షాలు కురుస్తున్న వేళ ఒకవైపు విషపురుగులు, పాములు హల్చల్ చేస్తుంటే మరోవైపు కొండచిలువలు జనం మధ్య సంచరిస్తూ భయాందోళన గురిచేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో నాటు కోళ్ల షాప్ లోకి ప్రవేశించిన కొండచిలువ ఆ షాప్ లోని కోళ్లను మింగి అక్కడే తిష్ట వేసింది. షాప్ యజమాని ఆ కొండచిలువను గమనించడంతో ఆయనకు ముప్పుతప్పింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో జరిగింది.పెద్దయాకూబ్ అనేవ్యక్తి ఇక్కడ నాటు కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. గుంజేడు ముసలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడ కోళ్లను మొక్కుగా నైవేద్యం సమర్పిస్తారు..ఈ క్రమంలోనే ఇక్కడ పెద్ద యాకూబ్ నాటుకోళ్ల దుకాణం పెట్టాడు.

అయితే ఎక్కడినుండి వచ్చిందో తెలియదు.. కొండచిలువ కోళ్లను భద్రపరిచే స్టాండ్ లోకి చొరబడింది. అప్పటికే రెండు కోళ్లను మింగిన కొండచిలువ అందులోనే తిష్టవేసింది. కోళ్లను బయటికి తీసేందుకు గమనించేసరికి అందులో కొండ శిలువలు చూసి షాప్ యజమాని షాక్ అయ్యాడు. కోళ్లను మింగిన కొండచిలువ ను చూసి వెంటనే అప్రమత్తమయ్యాడు. లేకపోతే ఆయనకు కూడా కొండచిలువతో ముప్పు వాటిల్లేది.. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే రంగంలో దిగిన అటవీ శాఖ సిబ్బంది ఆ కొండచిలువను అక్కడనుండి తొలగించి సమీపంలోని అడవుల్లో వదిలేశారు.

దాదాపు 5 గంటలపాటు కొండచిలువ హల్చల్ చేసింది. దీంతో స్థానికులు గుంజేడు ముసలమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ ప్రాంతంలో కొండచిలువ సంచరించడం ఇదే తొలిసారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు