డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!

డిజిటల్ గోల్డ్ లాగా డిజిటల్ సిల్వర్ కొంటారా? ప్రాసెస్ సింపుల్!

బంగారంతోపాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే రాబర్ట్ కియోసాకి లాంటి ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో వెండి ధరలు మరింత పెరుగుతాయని, బంగారం కంటే వెండిలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరి వెండిలో వెండిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిటల్ గోల్డ్ లాగానే డిజిటల్ సిల్వర్ ను కూడా కొనుగోలు చేయొచ్చు. ఫ్యూచర్ లో పెరిగే వెండి ధరల ద్వారా మీరు లాభపడాలి అనుకుంటే ఇలాంటి డిజిటల్ ఇన్వెస్ట్ మెంట్స్ బెటర్ ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే డిజిటల్ సిల్వట్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా సింపుల్. ఇంట్లో కూర్చొని కూడా వెండిని కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ సిల్వర్ లో పెట్టుబడి పెట్టడానికి మీరు సిల్వర్ ఈటీఎఫ్( ETF)లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదెలాగంటే..

ప్రాసెస్ ఇదే..
సిల్వర్ ఈటీఎఫ్ అంటే సిల్వర్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్ లాంటిది. దీని వాల్యూ వెండి ధరలు అనుగుణంగా మారుతుంది. సిల్వర్ ETFలను కొనుగోలు చేయడం కోసం మీరు సింపుల్ గా ఏదైనా ట్రస్టెడ్ మ్యూచువల్ ఫండ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. అక్కడ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలోకి వెళ్లి సెర్చ్ బార్ లో సిల్వర్ ఈటీఎఫ్(silver etf) అని టైప్ చేయండి. అక్కడ నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, హెచ్ డీఎఫ్ సీ సిల్వర్ ఈటీఎఫ్, కొటక్ సిల్వర్ ఈటీఎఫ్.. ఇలా పలు కంపెనీల ఈటీఎఫ్ లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకుని మీకు నచ్చినంత అమౌంట్ తో ఇన్వెస్ట్ చేయొచ్చు. రేటుని బట్టి మీకు యూనిట్స్ ఇవ్వబడతాయి.

లాభాలివే..
సిల్వర్ ఈటీఎఫ్ లు వెండి విలువను బట్టి మారుతుంటాయి. వెండి ధర పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఫండ్ రేటు కూడా మారుతుంటుంది. ఇక ఈటీఎఫ్ ద్వారా వెండిలో ఇన్వెస్ట్ చేస్తే మీరు స్వచ్ఛమైన వెండిలో ఇన్వెస్ట్ చేసినట్టే. లాంగ్ టర్మ్ లో లాభాలు కోరుకునే వాళ్లు ఓపికగా ఎదురుచూస్తే.. రాబోయే నాలుగైదు ఏళ్లలో వెండి ధరలు పెరిగినప్పుడు వాటిని తిరిగి అమ్మేసుకోవచ్చు. లేదా మరిన్ని ఏండ్లు ఉంచుకోవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు