ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఏపీలోని ఈ గ్రామం గురించి మీకు తెలుసా?

ఒకప్పుడు ప్రత్యేక దేశంగా పాలన సాగించిన.. ఏపీలోని ఈ గ్రామం గురించి మీకు తెలుసా?

పరిటాల గ్రామం పేరు వినగానే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది వజ్రాలు. ఎందుకంటే ఈ ప్రాంతానికి కొల్లూరు వజ్రగనులకు దగ్గరగా ఉండటంతో పరిటాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు దొరికేవని పెద్దలు చెబుతారు. ఇప్పటి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ వజ్రాల కోసం వేట కొనసాగుతుంది. అయితే ఈ గ్రామం కేవలం వజ్రాలకే కాకుండా అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది. అవేంటో తెలుసుకుందాం పదండి

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పరిటాల అనేది ఒక సాధారణ గ్రామం కాదు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ గ్రామం తనకంటూ సొంత పాలనతో స్వతంత్రంగా ప్రత్యేక దేశంగా కొనసాగింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా నైజం పాలనలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇంకా భారత్‌లో కలవలేదు. అలాంటి సమయంలో పరిటాల గ్రామ ప్రజలు నైజాం పాలనను అంగీకరించలేదు. తమ జీవితాలపై తమకే హక్కు ఉండాలంటూ వారికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. మా గ్రామాన్ని మేమే పరిపాలించుకుంటామని తేల్చి చెప్పారు.

ఆ తర్వాత వచ్చిన ప్రజలు రాజకారులకు కూడా వీరు భయపడలేదు. గ్రామం మొత్తం కలిసి వారిని ఎదిరించారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ప్రజలే తమ గ్రామాన్ని కాపాడుకున్నాడు. అలా పరిటాల నైజాం పాలన నుంచి బయటపడింది. నైజాం నుంచి విముక్తి పొందిన తరువాత పరిటాల గ్రామం దాదాపు మూడు సంవత్సరాల పాటు తనకంటూ సొంత పాలనతో కొనసాగింది. గ్రామంలోనే నిర్ణయాలు తీసుకుని అమలు చేసేవారు. 1950లో భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిటాల అధికారికంగా భారతదేశంలో కలిసిపోయింది.

పరిటాల పేరు వినగానే చాలా మందికి వజ్రాలు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ వజ్రాలు దొరికేవని పెద్దలు చెబుతారు. కొల్లూరు వజ్రగనులకు దగ్గరగా ఉండటంతో పరిటాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాల కోసం అన్వేషణ జరిగింది. ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే చాలూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాల కోసం వేట ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ఒక సాధారణ గ్రామంలో కనిపించిన పరిటాల చరిత్ర మాత్రం అసాధారణం. వజ్రాల కోసం మాత్రమే కాదు.. స్వాతంత్ర భావన కోసం పోరాడిన గ్రామంగా పరిటాల చరిత్రలో నిలిచిపోయింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు