ఆ సినిమా నాకు చాలా స్పెషల్.. కానీ ఆ పాత్ర అస్సలు నచ్చలేదు.. హీరోయిన్ సంగీత..

ఆ సినిమా నాకు చాలా స్పెషల్.. కానీ ఆ పాత్ర అస్సలు నచ్చలేదు.. హీరోయిన్ సంగీత..

దక్షిణాదిలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో సంగీత ఒకరు. తక్కువ సమయంలోనే నటిగా అలరించి మెప్పించింది. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సహాయ నటిగా అలరిస్తుంది. సంగీత అంటే ఠక్కున గుర్తొచ్చే చిత్రం ఖడ్గం. ఈ సినిమాలో అమాయకమైన నటనతో కట్టిపడేసింది.

టాలీవుడ్ హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంగీత ఖడ్గం సినిమా తన కెరీర్‌లో అత్యంత కీలకమైన, మరచిపోలేని అనుభవాలను అందించిన చిత్రంగా పేర్కొన్నారు. ఈ సినిమా తన జీవితానికి, కెరీర్‌కు ఒక మలుపు అని ఆమె అన్నారు. ఖడ్గంలో తనకు ఎన్నో మంచి అనుభవాలు ఉన్నాయని, ఇదొకటి అని చెప్పడం కష్టం కానీ, ఈ సినిమా తన కెరీర్‌నే మార్చివేసిందని వివరించారు. షూటింగ్ మొదటి రోజు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, అప్పటికి దర్శకుడు వంశీ తప్ప తనకు యూనిట్‌లో ఎవరూ తెలియదని సంగీత తెలిపారు. మేకప్ మ్యాన్ తన ముఖానికి పసుపు రంగు మేకప్‌ను, రోజ్ ఇక్కడ, జుట్టు నిటారుగా, జిడ్డుగా ఉండేలా చేశాడు అని, ఇది పూర్తిగా తప్పుగా ఉందని ఆమె అన్నారు. మేకప్ ఎప్పుడూ నటీనటులకు ప్లస్ అవ్వాలి కానీ, తనకు అది మైనస్ మైనస్ మైనస్ గా అనిపించిందని సంగీత పేర్కొన్నారు. మేకప్ పూర్తయ్యాక, అద్దంలో తనను తాను చూసుకోవడానికి కూడా సిగ్గుపడ్డానని, బయటకు వచ్చి షాట్ ఇవ్వడానికి భయపడి, వంశీని లోపలికి వచ్చి చూడమని కోరానని తెలిపారు. వంశీ వచ్చి, “అరే, బాగుందే. పర్‌ఫెక్ట్, ఫెంటాస్టిక్. అవుట్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్!” అని ప్రశంసించడంతో ఆమె ఆశ్చర్యపోయానని.. ఇది వంశీకి అలవాటైన మాటలని, ఆయన అద్భుతమైన ప్రశంసలతో వెంటనే షూటింగ్ ప్రారంభించమని చెప్పారని సంగీత గుర్తు చేసుకున్నారు.

బయటకు వెళ్లిన తర్వాత యూనిట్ సభ్యులు “బాగుంది, బాగుంది” అని అన్నా, అక్కడి జనంలో కొందరు “వంశీకి పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయిని వేశారేంటి? రవితేజ పక్కన ఈ అమ్మాయా?” అని గుసగుసలాడటం విన్నానని, ఆ మాటలు తన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీశాయని ఆమె చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత కూడా తాను థియేటర్‌లో చూడలేదని, చెన్నైలో ఒక ప్రివ్యూ థియేటర్‌లో చూశానని, అప్పుడు కూడా సినిమా ప్రభావం తనకు పూర్తిగా అర్థం కాలేదని తెలిపారు. అయితే, ఖడ్గం విడుదలైన తర్వాత ఇక్కడ వచ్చిన స్పందన చూసి, సినిమా ఎంతటి విజయం సాధించిందో, ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందని సంగీత వివరించారు. అందుకు దర్శకుడు వంశీకి ఎల్లప్పుడూ ధన్యవాదాలు చెబుతానని అన్నారు.

ఖడ్గంలో “ఒక్క ఛాన్స్” డైలాగ్ గురించి అడిగినప్పుడు, అది ఏడుస్తూ చెప్పాల్సిన సందర్భం అని, మళ్లీ చెప్పాలంటే కష్టం కానీ, చెప్పడానికి ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. నటిగా తన కెరీర్‌లో క్లాసికల్ డాన్స్‌తో కూడిన సినిమాలో నటించాలనే తన కల ఇంకా ఉందని, తాను ఇంకా నటిస్తున్నానని, జీవితం ఉందని పేర్కొన్నారు. ఈ అబ్బాయి చాలా మంచివాడు సినిమాలో ఒక చిన్న క్లాసికల్ డాన్సర్ పాత్ర చేసినా, అది డాన్స్ బేస్డ్ సినిమా కాదని సంగీత వివరించారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు