ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..

ఈ 4 లక్షణాలను లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదమే.. జాగ్రత్త..

ఇటీవల కాలంలో యువతలో కూడా పెరుగుతున్న గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం అత్యవసరం. వీటిని లైట్ తీసుకుంటే మీ చిట్టి గుండెకు గట్టి ప్రమాదం రావడం ఖాయం.
ఈ మధ్య గుండెపోట్లు అందరినీ కబళిస్తుంది. చిన్న నుంచి పెద్ద వరకు దీన్ని బారిన పడి చనిపోతున్నారు. యువత గుండెపోటుతో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మన లైఫ్‌స్టైలే ఈ గుండెపోటుకు కారణమని వైద్యలు అంటున్నారు. చాలా సందర్భాలలో ఎటువంటి ముఖ్యమైన లక్షణాలు కనిపించకముందే ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి, కొన్ని ముందస్తు సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.

శ్వాస ఆడకపోవడం
తేలికైన పనులు చేస్తున్నప్పుడు కూడా మీకు శ్వాస ఆడకపోవడం అనిపిస్తే లేదా కొన్ని మెట్లు ఎక్కడం లేదా చిన్నపాటి వ్యాయామం చేసినా అసాధారణమైన శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి కూడా వస్తే.. అది మీ గుండె ఇబ్బంది పడుతోందని సూచిస్తుంది. ఇది గుండె పనితీరులో క్షీణతను లేదా కొరోనరీ ఆర్టరీ వ్యాధి యొక్క ప్రారంభ దశలను సూచిస్తుంది కాబట్టి ఈ లక్షణాన్ని ఏ మాత్రం విస్మరించకూడదు.

పాదాలలో వాపు
పాదాలు, చీలమండలు లేదా దిగువ కాళ్ళలో వాపు రావడం తరచుగా జరుగుతుంటే ఇది ప్రమాదకర సంకేతం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ వాపు గుండె వైఫల్యం లేదా మూత్రపిండాల వైఫల్యానికి కూడా సంకేతం కావడానికి అవకాశం ఉంది. గుండె రక్తాన్ని సరిగా పంప్ చేయనప్పుడు ద్రవాలు చేరడం వల్ల ఈ వాపు వస్తుంది.

అలసట – బలహీనత
మీరు సాధారణం కంటే కొంచెం ఎక్కువ అలసిపోయినట్లు అనిపించినా, ముఖ్యంగా అకస్మాత్తుగా శరీరంలో బలహీనత పెరిగినా.. ఇది గుండెపోటుకు ముందస్తు సంకేతం కావచ్చు. ముఖ్యంగా మహిళల్లో, అధిక అలసట అనేది గుండె జబ్బుల సాధారణ లక్షణంగా ఉంటుంది. గుండె సమర్థవంతంగా రక్తాన్ని సరఫరా చేయలేనప్పుడు ఈ బలహీనత కనిపిస్తుంది.

మరొక కీలక సంకేతం
గుండె జబ్బులు ఉన్నవారిలో దాదాపు సగం మందిలో అంగస్తంభన సమస్య సంభవిస్తుంది. గుండె జబ్బులు రావడానికి ఐదేళ్ల ముందు వరకు కూడా ఈ లక్షణం సంభవించవచ్చని ఆయన వివరిస్తున్నారు. ధమనులు గట్టిపడటం లేదా మూసుకుపోవడం గుండెకు, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ ముందస్తు సంకేతాలను గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అత్యవసరం. పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా మీకు అసాధారణంగా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు