విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌

విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌

ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులకే కాదండోయ్‌.. ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అందుకే ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ఎక్కడైనా టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. వరుసగా మూడు రోజుల పాటు..

ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులు సంబరపడే శుభవార్తలే ఉంటున్నాయి. ఇటీవల వరుసగా సెలవులు అందుకున్నే విద్యార్థులు.. ఇప్పుడు వరుసగా మరో మూడు రోజుల పాటు సెలవులను ఆస్వాదించనున్నారు. ఈ సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు. విద్యార్థులకే కాదండోయ్‌.. ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అందుకే ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు ఎక్కడైనా టూర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.

ఆగస్ట్‌ 11 నుంచి14 వరకు తరగతులు కొనసాగవు:

ఇక ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులు తరగతులు సైతం కొనసాగవు. ఎందుకంటే ఆగస్ట్‌ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు, పోటీలలో నిమగ్నమైపోతారు. అందుకే ఈ రోజుల్లో విద్యార్థులు తరగతులు పెద్దగా కొనసాగవనే చెప్పాలి. అయితే వర్షం పడితే పూర్తిగా స్కూల్స్ కూడా బంద్ ఉండవచ్చు.

వరుసగా మూడు రోజులు సెలవులు:

ఇక ఆగస్ట్‌ 15 నుంచి 17వ తేదీ వరకు వరుస సెలవులు ఉండనున్నాయి. ముఖ్యంగా మెుదటి సెలవు 15 న వచ్చింది. ఈ రోజు వెళ్తే స్కూల్ కు వెళ్లి రావచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ వేడులక తర్వాత స్కూల్‌ ఉండదు కాబట్టి ఇంటికి రావచ్చు. అంటే దాదాపు 12 గంటల వరకు స్కూల్‌కు వెళ్లి రావచ్చు

ఇక ఆగస్ట్‌ 16వ తేదీన శ్రీకృష్ణాష్టమి. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఈ వేడుకలు ఘనంగా జరుపుకొంటారు. ఈ రోజు పాఠశాలలకు సెలవు ఉంటుంది. అంతేకాదు కాలేజీలు, కార్యాలయాలకు సైతం సెలవు ఉంటుంది. పిల్లలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది. ఇక 17వ తేదీ ఆదివారం. సాధారణంగా దేశ వ్యాప్తంగా విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉండనుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు