రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం!

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పునకు ఆమోదం!

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ఆమోద ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం పౌర సరఫరాల శాఖ దరఖాస్తులను సేకరిస్తోంది. వాటిని పరిశీలించి అర్హులైన సభ్యుల పేర్లను రేషన్‌ కార్డులలో చేర్చేందుకు ఆమోద ముద్ర వేస్తోంది.

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ఆమోద ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు వారి కుటుంబంలోని కొత్త వ్యక్తుల పేర్లను చేర్చుకునేందుకు కొన్ని పరిమితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏడేళ్లు దాటి వారికి మాత్రమే ప్రభుత్వం రేషన్ కోటాను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేరికకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో దాదాపు 20 శాతం మేర పరిష్కరించింది. అయితే మిగతా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిరిగి జిల్లాల్లోనే పాత రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం గ్రేటర్‌ పరిధిలోని మూడు లక్షలపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

అయితే గత ప్రభుత్వం నాటి నుంచే రేషన్‌కార్డులలో కొందరి సభ్యుల పేర్లు తొలగింపు కొనసాగుతున్నప్పటికి.. కొత్త సభ్యుల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేకుండాపోయింది. దీంతో పాటు ఉమ్మడి కుటుంబాలు రెండుగా విడిపోవడం, వివహారాలు జరగడంతో కుటుంబాల్లోకి కొత్త సభ్యులు చేరడం వంటి వాటితో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికి.. ఇన్నాళ్లు వాటిని ఆమోదించే ఆప్షన్ మాత్రం పౌర సరఫరా శాఖకు లేకపోయింది. తాజాగా రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చే ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు