ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు..
ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర లక్ష దాటేసింది. అయితే నిన్న తులం బంగారంపై రూ.1040 వరకు పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జూలై 24న మధ్యాహ్నం సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల తులం బంగారం పై ఏకంగా 1360 రూపాయలు తగ్గింది. నిన్న తులం ధర లక్షా 2,330 రూపాయలు ఉండగా, ఈ రోజు లక్షా 970 రూపాయలకు దిగి వచ్చింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1250 రూపాయలు తగ్గి ప్రస్తుతం 92,550 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా 18 వేల రూపాయలకు చేరుకుంది.
అయితే ఇటీవల నుంచి బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇది సాధారణ కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారింది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు బంగారం కొనాలంటేనే సామాన్యులకు పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే ఇప్పుడు కొంత ఊరట వచ్చింది. అయినా తులం ధర లక్ష రూపాయలకుపైనే ఉంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈ రోజు కాస్త తగ్గిపోయాయి.
ఇప్పట్లో బంగారం కొనడం మంచిదేనా?
మీరు పెళ్లిళ్లు, భవిష్యత్ పెట్టుబడి, ఉంగరాలు, గిఫ్ట్‌లు వంటి విషయాలకు బంగారం కొనాలని ప్లాన్ చేస్తే ప్రస్తుతం ఉన్న ధరలు మంచి అవకాశమే అని చెప్పొవచ్చు. ఎందుకంటే ఇవి తాత్కాలిక తగ్గుదలలు కావచ్చు. త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు:
ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అదనంగా, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు కూడా ఈ ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ఎనర్జీ సెక్టార్లలో ఉపయోగం, ఒక ప్రధాన కారణంగా మారింది.