బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది ఎక్కువగా కొనడానికి ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. కానీ ప్రస్తుతం గోల్డ్ రేట్స్ అనేవి ఆకాశాన్నంటుతున్నాయి.
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది ఎక్కువగా కొనడానికి ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. కానీ ప్రస్తుతం గోల్డ్ రేట్స్ అనేవి ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్స్ లక్షమార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, నేడు శని వారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
జూన్ 21, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,470 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,090గా ఉంది.
జూన్ 20, 2025 శుక్రవారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100,480గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.100,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.92,100గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.92,090గా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.100,470 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,090 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,20,000లుగా ఉంది.