అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. లక్షను టచ్ చేసి దాటిపోయిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. నేడు మరింతగా తగ్గి పసిడి ప్రియులకి భారీ ఊరట కలిగించింది. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి..

అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. లక్షను టచ్ చేసి దాటిపోయిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. నేడు మరింతగా తగ్గి పసిడి ప్రియులకి భారీ ఊరట కలిగించింది. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఆల్‌టైమ్‌ హై లక్ష నుంచి నుంచి దాదాపు రూ.3,500 వరకు బంగారం ధర తగ్గింది. తాజాగా.. పది గ్రాముల బంగారంపై రూ.700 మేర ధర తగ్గింది. దేశియంగా 22 గ్రాముల బంగారం ధర రూ.89,400 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.97530గా ఉంది. 22 క్యారెట్లపై రూ.620, 24 క్యారెట్లపై రూ.680 మేర ధర తగ్గింది. వెండి కిలోపై రూ.100 మేర తగ్గి రూ.1,01,800లుగా కొనసాగుతోంది.

లేటెస్ట్ బంగారం ధరలు ఇవే..
హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.89,400 లుగా ఉంది.

24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.97వేల 530 రూపాయిలుగా ఉంది.

మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.లక్షా 11 వేల 800 రూపాయిలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.89,400 లుగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.97వేల 530 రూపాయిలుగా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.లక్షా 11 వేల 800 రూపాయిలుగా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,550, 24 క్యారెట్ల ధర రూ.97680 లుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89400, 24 క్యారెట్ల ధర రూ.97530

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89400, 24 క్యారెట్ల ధర రూ.97530 లుగా ఉంది.

ఢిల్లీలో సిల్వర్ కేజీ ధర రూ.101,800 లు ఉండగా.. ముంబైలో రూ.101,800, చెన్నైలో రూ.1,11,800లుగా ఉంది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు