పసిడి పరుగులు ఆగట్లేదు. ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది. తొలిసారి 89 వేల రూపాయల మార్కు తాకి, ఆల్ టైమ్ హైని టచ్ చేసింది గోల్డ్… నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు వెండి కూడా పరుగులు తీస్తోంది. వాస్తవానికి గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి..
పసిడి పరుగులు ఆగట్లేదు. ఊహించిన దానికంటే వేగంగా పరిగెడుతోంది. ఇటీవల తొలిసారి 89 వేల రూపాయల మార్కు తాకి, ఆల్ టైమ్ హైని టచ్ చేసింది గోల్డ్… నేను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు వెండి కూడా పరుగులు తీస్తోంది. వాస్తవానికి గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ధర తగ్గడం పదుల్లో ఉంటే.. పెరగడం మాత్రం వందల్లో ఉంటోంది.. అయితే.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. తాజాగా గోల్డ్ రేటు స్వల్పంగా పెరగగా.. సిల్వర్ ధర తగ్గింది.
సోమవారం (17 ఫిబ్రవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.78,890, 24 క్యారెట్ల బంగారం ధర రూ.86,060 గా ఉంది. వెండి కిలో ధర రూ. 100,400 గా ఉంది. 10గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర పెరగగా.. వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.78,890, 24 క్యారెట్ల ధర రూ.86,060 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.78,890, 24 క్యారెట్ల ధర రూ.86,060 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,040, 24 క్యారెట్ల ధర రూ.86,210 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.78,890, 24 క్యారెట్ల ధర రూ.86,060 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.78,890, 24 క్యారెట్లు రూ.86,060 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.78,890, 24 క్యారెట్ల ధర రూ.86,060 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,07,900 గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,00,400 లుగా ఉంది.
ముంబైలో రూ.1,00,400
బెంగళూరులో రూ.1,00,400
చెన్నైలో రూ.1,07,900 లుగా ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.