పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు..! 2 రోజుల్లో ఎంత తగ్గిందంటే..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు..! 2 రోజుల్లో ఎంత తగ్గిందంటే..

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి..

పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే 98వేల వరకు చేరుకున్నాయి.. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. మే 30 2025 శుక్రవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 97,030 ఉండగా.. 22 క్యారెట్ల ధర 88,940 లుగా ఉంది.. రెండు రోజుల్లోనే పది గ్రాములపై రూ.800 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.99,800 లుగా ఉంది.

బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,030గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.88,940లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,800లుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,030గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.88,940లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,800 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,180గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,090లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,800లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,030, 22 క్యారెట్ల ధర రూ.88,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,030, 22 క్యారెట్ల ధర రూ.88,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,800లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,030, 22 క్యారెట్ల ధర రూ.88,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.

గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు