ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు

ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువులు పొందే ఛాన్స్.. జులై 23న ఇంటర్వ్యూలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం రాష్ట్ర అభ్యర్ధులకు మాత్రమే వీటిని పొందే అర్హత ఉంటుంది. ఈ కింది అర్హతలు ఉన్న వ్యక్తులు సంబంధిత సర్టిఫికెట్లతో జులై 23వ తేదీన ఈ కింది అడ్రస్ లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఇతర వివరాలకు..

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ, రెసిడెంట్ వైద్యుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా విద్యార్హతలు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 113 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 23న ఈ కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

పోస్టులు వివరాలు..
ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 4
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 14
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 21
ట్యూటర్ పోస్టుల సంఖ్య: 9
సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల సంఖ్య: 37
జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల సంఖ్య: 28
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల సంఖ్య: 06
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో బోధన, రిసెర్చ్‌ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. వయో పరిమితి నోటిఫికేషన్ తేదీ నాటికి సీనియర్ రెసిడెంట్లకు 45 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 69 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలు, బోదన అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎంపికైన వారికి ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,90,000, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,25,000, సీనియర్ రెసిడెంట్‌ పోస్టులకు నెలకు రూ.1,06,461, ట్యూటర్‌కు నెలకు రూ.55,000, జూనియర్ రెసిడెంట్‌ పోస్టులకు నెలకు రూ.46,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టులకు నెలకు రూ.52,000 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

జులై 23, 2025వ తేదీన.. ప్రిన్సిపాల్ చాంబర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నల్గొండ చిరునామాలో ఇంటర్వ్యూ జరుగుతుంది. అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు