క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం.. పోలీసు అదుపులో మాజీ కార్పొరేటర్..!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ముఠా పై పోలీసులు నిఘా పెట్టారు.. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ దందా కొనసాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు.. ఇప్పుడే బాధితులు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం నడిపిన ప్రధాన నిందితులలో ఒకరైన మాజీ కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ అనే వ్యక్తి సెప్టెంబర్ 11, 2025న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోతిరాంపూర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ తనకు పరిచయస్తుడని, అతను ‘మెటా ఫండ్ క్రిప్టో’ అనే స్కీమ్‌లో పెట్టుబడి పెట్టమని తనను ఆశ చూపించాడు. ఈ స్కీమ్‌లో రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని సతీష్ నమ్మబలికాడు. సతీష్ మాటలు నమ్మి, భాస్కర్ రూ. 15 లక్షలను సతీష్‌కు ఇచ్చారు. అంతేకాకుండా, మరింత మందిని ఈ పథకంలో చేరిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సతీష్ చెప్పడంతో, భాస్కర్ తన పరిచయస్తులైన మరో 17 మందిని కూడా ఈ స్కీమ్‌లో చేర్చారు. ఆ 17 మంది ద్వారా సతీష్ మొత్తం రూ. 1.20 కోట్లు వసూలు చేశాడు. ఈ మొత్తానికి మూడు నెలల్లో మూడింతలు లాభాలు ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. అయితే, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు.

సతీష్ ను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడని బాధితులు ఆరోపించారు. దీనిపై కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు బాధిుతుల. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. సతీష్ తోపాటు మరి కొంతమంది నిందితులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. లోకేష్ అనే ప్రధాన నిందితుడు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పటికి చాలా మంది ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సతీష్ నుంచి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. సతీష్ ను పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు కరీంనగర్ రూరల్ పోలీసులు..

Please follow and like us:
తెలంగాణ వార్తలు