మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి…

మాజీ సీఎం, బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఐదో సోదరి చీటీ సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు దాదాపు 85 వరకు ఉంటుందని సమాచారం. సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ విభాగంలో చేరిన సకలమ్మ శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ లోకాన్ని వీడారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో సకలమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసీఆర్‌ తన తోబుట్టువులతో ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రతి రాఖీ పండుగకు తప్పనిసరిగా కేసీఆర్‌ తన సిస్టర్స్‌తో రాఖీలు కట్టించుకుంటారు. కేసీఆర్‌కు మొత్తం ఎనిమిది మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. వీరిలో కొందరు కాలం చేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు