గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

గంగమ్మ తల్లిపై భారం వేసి.. సముద్రంలోకి వల విసిరాడు. కాసేపటికి వల బాగా బరువెక్కింది. అబ్బో.! పెద్ద చేప చిక్కింది అని సంతోషపడ్డాడు. పైకి లాగి చూడగా వలలో పడింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు మత్స్యకారుడు. ఆ గంగమ్మ తల్లిపై భారం వేసి బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళాక చేపలు పడ్డాయి. ఇంకొన్ని చేపలు పట్టుకునే క్రమంలో సముద్రంలోకి వల విసిరాడు. ఈసారి అదృష్టం పండినట్టు అనిపించింది. వల బరువెక్కింది. లాగుతున్నా బలం సరిపోవడం లేదు. మెల్లగా లాక్కుంటూ ఒడ్డు వరకు చేరుకున్నాడు. ఆ వలలో పడింది చూసి షాక్‌కు గురయ్యాడు. అదేంటో తెలియక తల పట్టుకున్నాడు. అధికారులకు సమాచారం అందించాడు ఆ మత్స్యకారుడు. అది భారీ చేప కంటే అతి విలువైన టోఫిష్ అని తెలుసుకుని కంగుతిన్నాడు.

ఎస్.! విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న.. చేపల వేట సాగిస్తుండగా వింత అనుభవం ఎదురయింది. వల బరువుగా మారడంతో ఆశపడ్డాడు. కష్టపడి వలలోకి చూసేసరికి.. అందులో పడింది చూసి కంగారుపడ్డాడు. వింతగా కనిపిస్తున్న ఓ యంత్రాన్ని పట్టుకుని అర్థం కాక.. మత్స్యశాఖ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అధికారులను కలిసి.. ‘ నా వలకు ఇది చెక్కింది దీని సంగతి ఏంటో తేల్చండి..’ అని చెప్పాడు. దీంతో వాళ్లకు కూడా ఆ పరికరం ఏంటో అంతుబట్టలేదు. విషయాన్ని వన్ టౌన్ పోలీసులకు చెప్పారు. నేవీ అధికారులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ పరికరం నేవీకి సంబంధించినదే. దాన్ని టోఫిష్ అంటారు. గతేడాది డిసెంబర్ నుంచి మాకు సిగ్నల్స్ తెగిపోయాయి దానికోసమే చూస్తున్నాం అని నేవీ అధికారులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

‘టో ఫిష్’ అంటే ఏంటి..
టో ఫిష్ అంటే చేప కాదు.. సముద్ర గర్భంలో కీలక సమాచారం అందించే సాంకేతిక పరికరం. నీటి అడుగున పనిచేసే అత్యాధునిక ఉపకరణం. సముద్రపు అడుగు భాగంలో అధ్యయనాలకు ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. త్రీ డీ మ్యాపింగ్, లోతు, సముద్ర గర్భంలోనే వస్తువులను గుర్తించడం దీని ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్ర గర్భాన్ని జల్లెడ పట్టడంలో టోపిష్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరికరంలో సైడ్ స్కాన్ సోనార్, సౌండ్ సెన్సార్, నేటి ఉష్ణోగ్రత లవణాల సాంద్రత వంటి వివరాలు కొలిచే సెన్సార్లతో కూడి ఉంటుంది. నావికా దళానికి కీలక ఉపకరణంగా పనిచేస్తుంది.

వాటికోసం కూడా.. కీలకంగా పని..
పరికరం చుట్టూ ఒక కిలోమీటరు వరకు డేటాను సేకరిస్తుంది. టోఫిష్ సముద్రపు అడుగుభాగం నుండి వంద మీటర్ల లోతు వరకు పనిచేయగలదు. ఇది లోతైన సముద్ర అధ్యయనాలకు అనుకూలంగా ఉంటుంది. సముద్రపు అడుగు భాగం లోతును కొలవడానికి, మ్యాప్ చేయడానికి టోఫిష్‌ను ఉపయోగిస్తారు. ఇది సముద్రం యొక్క ఉపరితల స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. టోఫిష్ ఫిషరీస్ అకౌస్టిక్స్(Fisheries acoustics)లో కూడా ఉపయోగించబడుతుంది. ఇది సోనార్ టెక్నాలజీని ఉపయోగించి చేపలు, ఇతర సముద్ర జీవుల పరిమాణాన్ని అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు