భారత సైన్యంలో అమరులైన సైనికుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం అందిస్తుంది. యుద్ధం, ఉగ్రవాద చర్యలు, ప్రమాదాలు, సహాయక చర్యల కారణంగా మరణించిన సైనికులకు రూ.45 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆర్మీ బెనివాలెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ కూడా అందుతుంది. రాష్ట్రాలు తమ విధానాల ప్రకారం అదనపు పరిహారం ఇస్తాయి.భారత సైన్యంలో అమరులైన సైనికుల కుటుంబాలకు చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుంది. ఈ పరిహారం మరణం సంభవించిన పరిస్థితులను బట్టి ఉంటుంది. అంటే యుద్ధ సమయంలో.. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో, సాధారణ విధిలో చనిపోయారా అన్న దాన్ని బట్టి.. నష్టపరిహారం ఉంటుంది. 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పరిహారం దిగువన విధంగా ఉంటుంది.
మరణ పరిస్థితి పరిహారం (రూ.)
యుద్ధంలో మరణం ₹45 లక్షలు
సరిహద్దు ఘర్షణలు ₹35 లక్షలు
ఉగ్రవాద చర్యలు ₹25 లక్షలు
ప్రమాదాలు, సహాయక చర్యలు ₹25 లక్షలు
ఈ పరిహారం మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి అన్ని రక్షణ శాఖల సైనికులకు సమానంగా ఉంటుంది. ఇక ఆర్మ్డ్ ఫోర్సెస్ బెనివాలెంట్ ఫండ్ నుంచి రూ2-8 లక్షల వరకూ ఇస్తారు. ఈ పరిహారంలో భార్యకు 35%, పిల్లలకు 35%, తల్లిదండ్రులకు 30% శాతం కేటాయిస్తారు. సైనికుడి ర్యాంకు ఆధారంగా కుటుంబానికి లేదా భాగస్వామికి పెన్షన్ ఇస్తారు. సైనికుడి బీమా పథకం ద్వారా, మరణం తర్వాత కుటుంబానికి ₹40 లక్షలు నుండి రూ 75 లక్షలు ఇన్సురెన్స్ కూడా అందుతుంది. ఇక పిల్లలకు కేండ్రియ విద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు ఉంటాయి. రాష్ట్రాలు కూడా తమ ప్రాంతానికి చెందిన అమరులకు పరిహారం అందజేస్తాయి. ఇవి రాష్ట్రాల విధానాలపై ఆధారపడి ఉంటాయి.