పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!

పత్తి రైతులకు శుభవార్త.. ఈ యాప్​లో ఎంట్రీ చేసుకుంటే క్వింటాకు రూ.8,110..!

రైతన్నలారా… పత్తి సాగు చేస్తున్నవారికి కీలక సమాచారం. మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ 1 నుంచి 30లోపు నమోదు చేసుకోవాలి. ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలు అప్‌లోడ్ చేసి, తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల్లో అమ్ముకోవచ్చు.

నమస్తే రైతన్నలూ.. ఈ ఏడాది మీరు పత్తి సాగు చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రైతులందరూ మద్దతు ధర అందుకునేందుకు… కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… కపాస్ కిసాన్ అనే యాప్ తీసుకొచ్చింది. పత్తి వేసిన రైతులు.. వారు పేర్లను సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఈ యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఎంట్రీ చేసుకున్న వారు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా.. కొనుగోలు కేంద్రాల్లో పత్తి పంటను అమ్ముకోవచ్చు. ఈ మేరకు మార్కెటింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ యాప్ గురించి సమాచారం… దీన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే మీ పిల్లలను అడిగే చెబుతారు లేదా అధికారులను అయినా సంప్రదించచ్చు. ఆ తర్వాత యాప్‌లో ఆధార్ కార్డు, మీ భూమి రికార్డులు, పత్తి పంటకు సంబంధించి రెవిన్యూ శాఖ వారి ఇచ్చిన రికార్డును అప్‌లోడ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా.. దేశవ్యాప్తంగా పత్తి రైతులు ఎందరున్నారు..? పత్తి పంట విస్తీర్ణం ఎంత అనే వివరాలు అన్నీ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా వద్ద రికార్డ్ అవుతాయి. మీకు మద్దతు ధర అందాలంటే.. వచ్చే నెలా ఆఖరులోపు యాప్‌లో రికార్డు చేయడం మార్చిపోవద్దు.

ఈ ఏడాది పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కపాస్​ కిసాన్​ యాప్‌లో రిజిస్టర్‌ అయిన రైతులు.. పత్తిని అమ్మే సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు ఏ రోజు మీరు పత్తిని సీసీఐ కేంద్రానికి తీసుకెళ్లాలో యాప్ వివరాలు పంపుతుంది. ఈ పద్దతి వల్ల రైతులకు నీరీక్షణ సమస్యలు ఉండవు. స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే సౌలభ్యాన్ని పొందవచ్చు.

సెప్టెంబర్ మొదటి వారం నుంచి నుంచి పత్తి పంట చేతికొస్తుంది. అయితే ఇటీవల కాలంలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో.. దిగుబడి పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు