బీరకాయ (Ridge Gourd) చాలా మంది సాధారణంగా తినే కూరగాయ.. బీరకాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు.. ఫైబర్ పుష్కలంగా ఉన్న బీరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే.. పలు సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బీరకాయ (Ridge Gourd) చాలా మంది సాధారణంగా తినే కూరగాయ.. బీరకాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు.. ఫైబర్ పుష్కలంగా ఉన్న బీరకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే.. పలు సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీరకాయతో చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు.. బీరకాయ కూర, చట్నీతోపాటు పలు రకాల వంటకాలు తయారు చేసుకుంటారు. ఇతర కూరగాయలతో పోలిస్తే.. బీరకాయ మృదువుగా, సులభంగా కరుగుతుంది.. కావున.. దీన్ని వండడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు.. అంతేకాకుండా.. బీరకాయను ఇతర కూరలతో కలిపి కూడా సులభంగా వండుకుని తినవచ్చు..
ఎన్నో పోషకాలు..
బీరకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బీరకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం.. అందుకే బీరకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా బీరకాయలోని ఔషధ గుణాల గురించి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు. ఇలా ఎన్నో పోషకాలున్న బీరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు..? వాటి వివరాలను తెలుసుకోండి..
బీరకాయలో శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేసే కొన్ని సహజ పదార్థాలను కలిగి ఉంటుంది.. అందుకే ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు ఈ బీరకాయను రాత్రి భోజనంలో తీసుకుంటే మంచిది.. ఉదయం నాటికి వారి రక్తంలో చక్కెర పూర్తిగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బీరకాయ జీర్ణక్రియను మెరుగుపరిచే, రక్తాన్ని శుద్ధి చేసే కూరగాయ. ఇది మలబద్ధకం, గ్యాస్ట్రిటిస్, అజీర్ణం వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కడుపు సమస్యలు ఉన్నవారికి బీరకాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వినియోగం శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. ప్రేగులను శుభ్రం చేస్తుంది.
బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిని జుట్టు, చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగిస్తారు.
బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అంతేకాకుండా శక్తికి మూలంగా దీనిని పరిగణిస్తారు. ఇందులో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి.. ఇది ఆకలిని నియంత్రించి.. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
బీరకాయలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి.. ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది..