ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగడం వలన పేగులు శుభ్రపడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చర్మ, కేశ సంరక్షణకు తోడ్పడుతుంది. శక్తిని అందించి, వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. మునగాకు నీళ్లు సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం.
భారతీయ వంటకాలు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దీని ప్రత్యేకమైన రుచులు ప్రజల్ని ఆకర్షించడమే కాకుండా గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇక్కడ ఉపయోగించే ప్రతి కూరగాయకు దాని సొంత ప్రత్యేకమైన రుచి, ప్రయోజనాలు ఉన్నాయి. మునగ కూడా అటువంటి మొక్కలలో ఒకటి. ఒక్కమాటలో చెప్పాలంటే మునగ సంపూర్ణ ఔషధ నిధిగా పిలుస్తారు. ఇది పురాతన కాలం నుండి ఉపయోగించే కూరగాయ, ఔషధ మూలికగా కూడా పనిచేస్తుంది. ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. మునగ చెట్టులోని ప్రతిభాగం ఒక ఔషధంగా పనిచేస్తుంది. దాని ఆకులు, కాయలు, పువ్వులు, కాండం అన్నీ ప్రయోజనకరమైనవి. అయితే, మునగ ఆకులు లేదా దాని పొడిని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తాగడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ చూద్దాం..
మునగాకుతో తయారు చేసిన నీటిలో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. మునగ నీరు, వేడిగా లేదా చల్లగా ఉన్నా, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగితే పేగులు పూర్తిగా డీటాక్స్ అవుతాయి. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. మునగాకు నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. దీంతో కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. లివర్ హెల్తీగా ఉంటుంది
రోజూ ఉదయం మునగాకు నీళ్లు తాగితే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. తద్వారా గుండె ఎల్లపుడూ ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. షుగర్ ఉన్నవాళ్లు మునగాకు నీళ్లు తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిని సమతుల్యం చేయవచ్చు. మునగాకు నీళ్లు తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా ఉంటుంది.
మునగాకులో ఉండే విటమిన్లు, మినరల్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మునగాకు నీళ్లు తాగితే శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ఖాళీ కడుపుతో తాగితే రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. హెల్తీగా ఉంటారు. ఖాళీ కడుపుతో మునగాకు నీళ్లు తాగితే వాపులు, నొప్పులు తగ్గుతాయి. అందులో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

