డీఆర్‌డీఎల్‌ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. అర్హతలుంటే చాలు నేరుగా ఎంట్రీ!

డీఆర్‌డీఎల్‌ హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌లకు ఛాన్స్‌.. అర్హతలుంటే చాలు నేరుగా ఎంట్రీ!

డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్ లాబోరేటరీ (DRDL) హైదరాబాద్.. వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 165 ఇంటర్న్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14, 2025వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో..

హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో (DRDO)- డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్ లాబోరేటరీ (DRDL).. వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 165 ఇంటర్న్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14, 2025వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌ ఖాళీలు మొత్తం ఎలక్ట్రానిక్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, మెటలర్జీకల్, సిరామిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, కంప్యూటర్ సైన్స్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ.. విభాగాల్లో భర్తీ చేయనున్నారు.

డీఆర్‌డీవో- డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్‌ చేయాలంటే ఏదైనా విద్యా సంస్థలో 2025-26 విద్యా సంవత్సరానికి డీగ్రీ, పీజీ చదువుతున్న ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థులు మాత్రమే అర్హలు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను జులై 14, 2025వ తేదీలోపు సమర్పించవల్సి ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలను జులై 26వ తేదీన నిర్వహిస్తారు. ఆగస్టు 1 నుంచి ఇంటర్న్‌షిప్‌ శిక్షణ ప్రారంభమవుతుంది. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి 6 నెలల వరకు ఉంటుంది. ఇంటర్నర్‌షిప్‌ కాలంలో నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఎంపికైన వారిని డీఆర్‌డీఎల్‌/ఏఎస్‌ఎల్‌/సీఏఎస్‌ హైదరాబాద్‌ లొకేషన్లలో పని చేయవల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు ఈ కింది నోటిఫికేషన్ చెక్ చేయండి.

Please follow and like us:
తెలంగాణ వార్తలు